మైనర్లు డ్రైవింగ్ చేస్తూ దొరికితే స్కూల్ పేర్లు బయటపెడతాం : విద్యాసంస్థలకు సజ్జనార్ హెచ్చరిక
రాష్ట్రంలో సోమవారం నుంచి విద్యార్థులు బడి బాట పట్టారు. చిన్నారులు సంక్షేమంగా, సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం, అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే స్కూల్ బస్సులు, ఆటోల ఫిట్నెస్ పరీక్షలూ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మైనర్లు డ్రైవింగ్ చేయడం, డ్రగ్స్ వినియోగించడం వంటి అంశాల పట్ల విద్యాసంస్థలను హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ మేరకు నగరంలోని పలు స్కూల్ యాజమాన్యాలతో కలిసి పలు కీలక విషయాలపై ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు.
ఆ పరిస్థితి తీసుకురావద్దు : మైనర్లు డ్రైవింగ్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ మేరకు నగరంలోని విద్యాసంస్థల యాజమన్యాలకు రవీంద్రభారతిలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థుల భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, డ్రగ్స్ నియంత్రణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ర్యాష్ డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్‌పై విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. డ్రైవింగ్ చేస్తూ పట్టుబడే మైనర్ల స్కూళ్ల పేర్లను ప్రస్తావించే పరిస్థితి తీసుకురావొద్దంటూ హెచ్చరించారు.
పాఠశాలలు డీ మెరిట్ విధానాన్ని పాటించాలి : మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడే విద్యార్థుల వివరాలను నేరుగా సంబంధిత పాఠశాలలకు పంపుతామని, వారి ప్రగతి పత్రాల్లో నెగెటివ్ మార్కింగ్ ఇచ్చేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే కొందరు స్కూల్ బస్సు డ్రైవర్లు డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడుతున్నారని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చిన్నారులుండే బస్సులకు డ్రైవర్లుగా ఉంటున్న వారి విషయంలో యాజమాన్యాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్ ఇవ్వాలి : పాఠశాలల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రతి స్కూల్ విధిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు, ట్రాఫిక్ మార్షల్స్ లేదా వాలంటీర్ల వ్యవస్థను తీసుకురావాలని యాజమాన్యాలకు సీపీ సజ్జనార్ సూచించారు. ఇక ప్రతిరోజూ స్కూల్ అసెంబ్లీలో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్, సైబర్ క్రైమ్, డిజిటల్ అడిక్షన్, డ్రగ్స్ అనర్థాలపై ఉపాధ్యాయులు విధిగా అవగాహన కల్పించాలన్నారు. పేరేంట్-టీచర్ మీటింగ్స్ ద్వారా తల్లిదండ్రులకూ సామాజిక సమస్యల పట్ల అవగాహన కల్పంచాలన్నారు.
కోప్టా చట్టం అమలు చేస్తున్నాం : అలాగే పాఠశాలలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తులు విక్రయించకుండా కోప్టా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని, ఎక్కడైనా అమ్మకాలు జరిగితే వెంటనే అడ్డుకునేలా యాజమాన్యాలు కూడా బాధ్యత తీసుకోవాలని సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ సజ్జనార్‌తో పాటు ట్రాఫిక్ జాయింట్ సీపీ, జీహెచ్ఎంసీ కమిషనర్, రవాణా శాఖ కమిషనర్, పాఠశాలల యాజమాన్యాలు హాజరయ్యాయి.
మంచి పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత పాఠశాలల యాజమాన్యాలపై ఉంది. మైనర్లు డ్రైవింగ్ చేస్తే అస్సలు సహించేది లేదు. పాఠశాలకు పిల్లలను తీసుకొచ్చే డ్రైవర్లపైనా స్కూల్ యాజమాన్యాలు దృష్టిపెట్టాలి. పిల్లల భద్రతను గాలికి వదిలేయొద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో డ్రైవర్లు దొరికితే విద్యాసంస్థల పేర్లు బయట పెట్టాల్సి వస్తుంది. - సజ్జనార్, హైదరాబాద్ సీపీ
డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ స్కూల్ ఆటో డ్రైవర్ : విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆసిఫ్‌నగర్ ట్రాఫిక్ పోలీసులు మెహదీపట్నం ప్రాంతంలో స్కూల్ బస్సులు, స్కూల్ ఆటోలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో విద్యార్థులను తరలిస్తున్న ఓ స్కూల్ ఆటో డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు గుర్తించారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి కౌన్సెలింగ్ నిర్వహించారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, స్కూల్ యాజమాన్యాలు, డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆసిఫ్‌నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రుక్మిణి హెచ్చరించారు.