జీవితకాల సారధి గడియారం
మానవ
జీవనసాఫల్యతలో
సమయపాలన కీలక
భూమిక పోషిస్తుంది
ప్రగతి పురోగతి సాధనలో
కాలం విలువైందని
గడియారం
హెచ్చరిస్తుంది
టిక్ టిక్ మంటూ సాగే
గడియారపు ముళ్ళు
నిరంతరం శ్రమించే
విరామమెరుగని
ఓ కాల యంత్రం
మానవ ప్రగతికి
నీవే కదా సూత్రధారువు
ప్రణాళికల అమలుకు
నీవే కదా దిక్సూచివి
నిశ్శబ్ద రాత్రుల్లో
నీ ముళ్ళు కదిలినా
నిద్రించే లోకానికి
అలారం శబ్దంతో
మేలుకొలుపు పాడుతావు
జనాన్ని పనులకు
పురమాయిస్తావు
సుఖమున్నా కష్టమున్నా
సమానంగా చూస్తూ
సమదృష్టితో బతకాలని
పాఠాలు నేర్పుతావు
రాజునైన పేదనైన
ఒకేలా చూస్తావు
ధనమున్నా బలమున్నా
నీ పరుగును ఆపవు
గడచిన కాలం తిరిగిరాదని
చెపుతూ సమయమేసంపద
అని హితబోధ చేస్తావు
ముందుకు సాగాలని నిత్యం
హెచ్చరిస్తావు
ప్రేమాభిషేకం చిత్రంలోని
పాట ఆగదు ఏ నిమిషము
నీకోసం ఆగితే సాగదు ఈలోకం
ముందుకు సాగదు ఈ లోకం
అన్నది జీవితంలో సమయం
విలువకు గడియారమే స్పూర్తి
ఓటమితో కుంగిపోతే
టైమ్ దాటిపోతుంది అంటావు
గెలుపుతోవిర్రవిగితే గర్వపడకు
అని వారిస్తావు
క్షణాల విలువను గుండె
చప్పుడుగా మారుస్తూ
బ్రతుకు పుస్తకములో పేజీలు
తిరిగేస్తుంటావు
నీవు తిరిగే గుండ్రని వలయం
మనిషికి నేర్పే జీవిత కాల చక్రం
సమయమే సంపద అంటావు
సకాలంలో స్పందిస్తేనే
సత్ఫలితాలు సిద్ధిస్తాయని
దశ దిశను నిర్దేశిస్తావు
కష్టాల చీకటి తర్వాత
సుఖాల వెలుగు వస్తుందని
మార్పు ఒక్కటే జగతిలో
శాశ్వతమని
ఆశావహ దృక్పథంతో
అడుగులు వేస్తే అభివృద్ధి
సాకారమవుతుందని
నిరేశిస్తావు
ఆలస్యం అమృతం
విషమని గుర్తుచేస్తూ
కర్తవ్యాన్ని సకాలంలో
నెరవేర్చమంటావు
నీ కదలికలతో మానవ
మనుగడ ముడివడి ఉంది
ప్రతి క్షణాన్ని అద్భుతంగా
బ్రతకమని దీవిస్తావు
హృదయపు లయకు
నువ్వే కదా తోడు
నీతో నడిచినవాడు
ఎన్నటికీ కాడు బేజారు
చేతికి ధరించే కాలరత్నానివి
స్త్రీ పురుష భేదం లేకుండా
అందరికి ముంచేతికి కంకణమైతావు
ఆరోగ్య సూచనలకు
మార్గదర్శివై ఆరోగ్యానికి
డిజిటల్ సమాచార దర్శిగా
అలరారుతున్నావు
నిన్నుగెలిచినవాడే లోకానికి
విజేత అవుతాడు
టైమ్ ఈజ్ వెల్త్ వర్క్ ఈజ్ వర్షిప్
మన జీవన శైలి కావాలి
సమయ పాలనతో వికసిత
భారత్ లక్ష్య సాధనకు
పౌరసమాజం సాగిపోవాలి
ఆగదు కాలం ఆగదు
ఈజీవన గమనం
కాల సారధి నడిపించేదారిలో
సాగిపోవడమే మన కర్తవ్యం
కావాలి.
(జూన్19 జాతీయ వాచ్ దినోత్సవం సందర్భంగా)
నేదునూరి కనకయ్య
కాలమిస్ట్
కరీంనగర్9440245771