🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 19 Jun, 2026 | Page: 1

మెట్రో ఫేజ్-2కు అదనంగా మరో రూ.1,915 కోట్లు - ఆలస్యమయ్యే కొద్దీ అంచనా వ్యయం పైపైకి

ప్రస్తుతం హైదరాబాద్​ నగరంలో ప్రజలకు మెట్రో అద్భుతమైన సేవలను అందిస్తోంది. 69 కిలోమీటర్ల మేర 3 కారిడార్లతో మెట్రో ఫేజ్​-1ను రూ.22,000 కోట్లతో విస్తరించారు. గతంలో ఇది ప్రైవేట్​ సంస్థ కింద ఉండగా, ఇటీవల ఇది ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఇక రెండో దశ మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రతిపాదనలను కేంద్రానికి పంపిచింది. కానీ పలు కారణాల వల్ల నిధుల విడుదలపై ఆలస్యం జరుగుతోంది. దీంతో రెండో దశ విస్తరణకు అడుగులు పడట్లేదు. దీనివల్ల మెట్రో రైలు రెండో దశ అంచనా వ్యయం పెరిగిందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

162.5 కిలోమీటర్ల కోసం రూ.43,848 కోట్లు : గత ఏడాది అంచనాలతో పోలిస్తే మెట్రో రైలు రెండో దశ అంచనా వ్యయం రూ.1,915 కోట్లు పెరిగింది. ప్రాజెక్టు ఆలస్యం అవుతున్న కొద్దీ ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో రైలు రెండో దశ కోసం తొలుత ఐదు కారిడార్లను ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వం కారిడార్ల వారీగా డీపీఆర్‌లను 2024 నవంబర్ 4న కేంద్రానికి సమర్పించింది. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు ప్రభుత్వం మరో మూడు కారిడార్లను ప్రతిపాదించి, వాటికి సంబంధించిన డీపీఆర్‌లను 2025 జూన్ 21న కేంద్రానికి పంపింది. ఈ ఎనిమిది కారిడార్లలో 162.5 కిలోమీటర్ల కోసం రూ.43,848 కోట్ల అంచనాను సిద్ధం చేశారు. ఇందులో ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో ప్రతిపాదన కూడా ఉంది. దీనిని మినహాయిస్తే, 122.9 కిలోమీటర్ల అంచనా వ్యయం రూ.36,680 కోట్లు.
🏠 Home