🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 18 Jun, 2026 | Page: 1

పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు ఎప్పుడంటే ?

యుద్దం ముగిసింది. అమెరికా-ఇరాన్ మధ్య ఎట్టకేలకు డీల్ కుదిరింది. దీంతో నాలుగు నెలలుగా క్రమంగా పెరుగుతూ పోయిన క్రూడాయిల్ ధరలు కూడా దిగివస్తున్నాయి. దీంతో భారత్ లోనూ పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయన్న ఆశలు చిగురిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్రం తీసుకునే నిర్ణయంపై అంతా ఉత్కంఠగా ఎదురుచూసున్నారు. దీంతో కేంద్ర పెట్రోలియం, సహజవనరులశాఖ సహాయ మంత్రి సురేశ్ గోపీ చమురు ధరల తగ్గింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు.ఛార్జీల పెంపు తప్పదా ? చమురు సంక్షోభం వేళ..! ఇరాన్ యుద్ధం ముగియడంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర బ్యారెల్ కు 80 డాలర్లకు పడిపోయింది. నిన్న మొన్నటివరకూ 100 డాలర్లు పలికిన ధర బారీగా పతనం కావడంతో ఆ మేరకు భారత్ లో వినియోగదారులకు చమురు సంస్థలు ఊరటనిచ్చే అంశంపై అడిగిన ప్రశ్నకు సురేశ్ గోపీ సమాధానం ఇచ్చారు. అయితే ఇప్పటికిప్పుడు చమురు ధరలు తగ్గించలేమని ఆయన తేల్చిచెప్పేశారు. పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుందన్నారు.

🏠 Home