ఉస్మానియా కాలేజీలో ర్యాగింగ్ కలకలం - 12 మంది విద్యార్థులపై కేసు నమోదు - 6 నెలలు సస్పెండ్
హైదరాబాద్ కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఉదంతం తీవ్ర కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులను వేధించారనే ఆరోపణలపై పలువురు సీనియర్ విద్యార్థులపై యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. బీడీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ర్యాగింగ్ చేశారనే ఫిర్యాదుపై 12 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
కాలేజీలో ర్యాగింగ్ జరిగినట్లు బాధితులు ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. అధికారిక ఫిర్యాదు ఆధారంగా సుల్తాన్ బజార్ పోలీసులు రంగంలోకి దిగారు. ర్యాగింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారణ అయిన 12 మంది ఫైనల్ ఇయర్ బీడీఎస్ విద్యార్థులపై తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా నిందితులను కాలేజీ నుంచి 6 నెలల వరకు సస్పెడ్ చేస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు.
హాస్టల్లో సీనియర్ల రుబాబు : జూనియర్లన్న అలుసుతో సీనియర్ విద్యార్థులు ఇష్టారితీన వ్యవహరించినట్లు తెలుస్తోంది. "ఏరా సిగరెట్లు తెమ్మంటే తీసుకురావా? నీ డబ్బులతో బిర్యానీ ఆర్డర్ పెట్టు! నడుచుకుంటూ వెళ్లి ఐదు లీటర్ల వాటర్ క్యాన్ తీసుకురా!" పగలు రాత్రి అనే తేడా లేకుండా ఉస్మానియా మెడికల్ కాలేజీ వసతి గృహంలో జూనియర్లపై కొందరు సీనియర్ విద్యార్థులు సాగిస్తున్న రుబాబు ఇది.
అంతేకాదు జూనియర్లపై అంత దారుణంగా ప్రవర్తించవద్దని సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన సీనియర్లనూ వారు చితకబాదారు. హైదరాబాద్ ఉస్మానియా వైద్య కళాశాల (ఓఎంసీ) వసతి గృహంలో 4 గోడల మధ్య జరిగిన ఈ ఆగడాలు ప్రిన్సిపల్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చాయి.
ర్యాగింగ్‌తో మానసిక ఒత్తిడి : బుధవారం సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ ఎం.మట్టయ్య, ఇన్‌స్పెక్టర్ జి.నరేశ్‌తో కలిసి ఖైరతాబాద్ డీసీపీ కె.శిల్పవల్లి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఎంతోకాలంగా వసతి గృహంలో జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ పేరుతో వేధిస్తున్నారని ఆమె తెలిపారు. ఈ నెల 8న 2025 బ్యాచ్‌కు చెందిన 14 మంది మొదటి సంవత్సరం విద్యార్థులను, ఆఖరి సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్‌తో మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నట్టు ఇంటర్న్‌షిప్ చేస్తున్న కొందరు గుర్తించి అడ్డుకున్నారని చెప్పారు. ఈ క్రమంలో విషయం కాలేజీ దృష్టికి వెళ్లిందన్నారు.