చల్లటి కబురు - తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు హైదరాబాద్, కోరాపుట్, ముజఫర్పుర్, భద్రాచలం వరకూ విస్తరించాయని వాతావరణ శాఖ బుధవారం పేర్కొంది. రానున్న నాలుగైదు రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, ఒడిశా, తెలంగాణ, బిహార్ రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల పరిస్థితులున్నట్లు వివరించింది. తూర్పు ఉత్తర్ప్రదేశ్పై ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది.
వడగాలులు వీచే అవకాశాలు - ఎక్కడంటే? : 'రాష్ట్రంలో గురువారం ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే సూచనలున్నాయి.' అని వాతావరణ శాఖ సూచించింది.