ఏపీ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 529 పోస్టులు..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 529 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల నియామక బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల్లో స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ల పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 30, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.