వివాదంలో మెస్సీ.. ఫౌల్ చేసినా కార్డు చూపని రిఫరీ..
అర్జెంటీనా, అల్జీరియా మధ్య జరిగిన మ్యాచ్ పెద్ద వివాదానికి దారితీసింది. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) చేసిన కఠిన ఫౌల్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మ్యాచ్‌లో అల్జీరియా ప్లేయర్‌పై మెస్సీ వెనుక నుంచి స్టడ్స్-అప్ ఛాలెంజ్ చేశాడు. దీంతో ఆ ప్లేయర్ నొప్పితో నేలపై పడిపోయాడు. ఇది కచ్చితంగా రెడ్ కార్డు ఇవ్వాల్సిన ఫౌల్ అని అభిమానులు మండిపడుతున్నారు. వీఏఆర్ ఈ ఘటనను రివ్యూ చేసినప్పటికీ, మ్యాచ్ రిఫరీ సైమన్ మార్సీనియాక్ మెస్సీకి ఎల్లో కార్డు కూడా ఇవ్వకుండా వదిలేశారు. అయితే రిఫరీ నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగుతోంది. ‘మెస్సీ అయితే రూల్స్ మారిపోతాయా?’ అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో లియోనల్ మెస్సీ చరిత్ర సృష్టించాడు. హ్యాట్రిక్ గోల్స్ చేసి 3-0తో అల్జీరియాపై ఘనవిజయం సాధించాడు.
మరోవైపు ఈ మ్యాచ్‌తో మెస్సీ ఖాతాలో మరో రికార్డు పడింది. వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక సంఖ్యలో గోల్స్ చేసిన జర్మనీ ప్లేయర్ మిరోస్లేవ్ క్లోస్‌తో సమానంగా నిలిచాడు. జర్మనీ ఫుట్‌బాలర్ క్లోస్ వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధికంగా 16 గోల్స్ చేసి లీడింగ్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే ఇప్పుడు అతని రికార్డును మెస్సీ సమం చేశాడు