ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సమన్వయంతో చర్యలు చేపట్టాలి
: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్
...జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా RTA సభ్యుడు పోషల్ రాజేష్.
నారాయణపేట జిల్లా, జూన్ 16 (బి వి కే న్యూస్ )
నారాయణపేట జిల్లాలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, పార్కింగ్ నిర్వహణ, రహదారి భద్రతకు సంబంధించిన అంశాలపై జిల్లా RTA సభ్యుడు పోశాల రాజేష్ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోశాల రాజేష్ ఎస్పీకి పుస్తకాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలు, వాహనాల పార్కింగ్ ఇబ్బందులు, ప్రజలకు ఎదురవుతున్న రవాణా సంబంధిత సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా నారాయణపేట పాత బస్టాండ్ ప్రాంతం, సత్యనారాయణ చౌరస్తా, మక్తల్, కోస్గి పట్టణాల్లో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండటం, రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలను పార్క్ చేయడం వల్ల ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS మాట్లాడుతూ... రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలిపివేయడం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో పాటు ప్రమాదాలకు కూడా అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
పట్టణాల్లో గుర్తించిన ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయడం, రహదారులపై అక్రమ పార్కింగ్‌ను నియంత్రించడం, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన చర్యలు చేపట్టడం వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగే విధంగా పక్కా ప్రణాళికతో పార్కింగ్ నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని ఆర్టీఏ సభ్యుడు పోశాల రాజేష్‌కు సూచించారు.
జిల్లాలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు పోలీసు శాఖ, రవాణా శాఖ, మున్సిపల్ శాఖల మధ్య సమన్వయం మరింత పెంచి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థ అందించే దిశగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో MVI SK మున్నీ, AMVI సాయి తేజ రెడ్డి పాల్గొన్నారు.