🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 16 Jun, 2026 | Page: 1

దోస్త్‌ మూడో విడత కౌన్సెలింగ్‌లో మార్పు

డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) మూడో విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్లో మార్పులు చేసినట్టు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వీ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఈ నెల 21 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని, 16 నుంచి 22 వరకు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవచ్చని, 25న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు
రాష్ట్రంలోని సర్కార్‌ జూనియర్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం దశాబ్దాల కల అని జూనియర్‌ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు పీ మధుసూదన్‌రెడ్డి, ప్రిన్సిపాళ్ల సంఘం అధ్యక్షుడు కళింగ కృష్ణకుమార్‌ అభిప్రాయపడ్డారు. ఈ పథకం ఇంటర్‌ విద్యార్థుల ఆకలిబాధను తీరుస్తుందని వారు పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకం ప్రారంభంపై వారు హర్షం వ్యక్తంచేశారు. మధ్యాహ్న భోజనం సమకూర్చాలని ఎన్నో ఏండ్లుగా విజ్ఞప్తి చేశామని, ఇన్నాళ్లకు సాకారమైందని పేర్కొన్నారు.
🏠 Home