🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 16 Jun, 2026 | Page: 1

సరికొత్త వ్యూహంతో బీఆర్ఎస్ Gen-Z పాలిటిక్స్ - వచ్చే ఎన్నికల్లో యువ ఓటర్లపై ఫోకస్

జెన్‌జీ యువతపై గురిపెట్టిన బీఆర్​ఎస్ పార్టీ యువతే లక్ష్యంగా కొత్త రాజకీయ వ్యూహాన్ని అమలు చేసేందుకు కసరత్తు మొదలు పెట్టింది. గత అనుభవాల దృష్టిలో పెట్టుకుని యువతతో పార్టీకి మరింత అనుసంధానం అవసరమన్న నిర్ణయానికి వచ్చింది. యువత, ఐటీ ఉద్యోగుల్లో బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్​కు ఉన్న క్రేజ్​ను ఓట్ల రూపంలోకి మార్చుకోవాలని భావిస్తోంది. త్వరలోనే పెద్ద ఎత్తున జెన్​జీ యువతతో ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించేందుకు గులాబీ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది.
🏠 Home