మహబూబాబాద్ జిల్లాలో దారుణం - అల్లుడిని రాడ్‌తో కొట్టి చంపిన మామ
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఉప్పరపల్లి గ్రామానికి చెందిన నరేశ్(35), గత కొంత కాలంగా మద్యానికి బానిసై తన భార్యను తీవ్రంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో భార్య పుట్టింటికి వెళ్లి నరేశ్‌పై కేసముద్రం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది.
వివాదంలో రాడ్‌తో కొట్టిన మామ : నరేశ్ది తన అత్తగారి ఊరు ఒకటే కావడంతో అక్కడికి వెళ్లి భార్య, అత్త, మామలతో ఘర్షణకు దిగాడు. దీంతో ఆగ్రహవేశాలతో నరేశ్ మామ ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. దీంతో నరేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధుమిత్రుల రోదనలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.