🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 15 Jun, 2026 | Page: 1

ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలి

: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్

నారాయణపేట జిల్లా, జూన్ 15 (బి వి కే న్యూస్ )

ఇటీవల పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌హెచ్‌ఓలుగా బాధ్యతలు స్వీకరించిన దామరగిద్ద ఎస్‌ఐ నరేష్ మరియు కోస్గి ఎస్‌ఐ పురుషోత్తం నేడు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు. అనంతరం నూతన బాధ్యతలు చేపట్టిన అధికారులకు అభినందనలు తెలియజేసి, తమ విధులను అంకితభావంతో నిర్వహించాలని సూచించారు.
మండల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా పనిచేయాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, నేరాలు, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ కమ్యూనిటీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునికి మర్యాదపూర్వకంగా స్పందించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలు, బాలికలు, వృద్ధులు మరియు బలహీన వర్గాల భద్రతకు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
అదేవిధంగా సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, చోరీలు, భూ వివాదాలు, రోడ్డు ప్రమాదాల నివారణ వంటి అంశాలపై ప్రత్యేక నిఘా ఉంచి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని పొందే విధంగా పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ గారు పేర్కొన్నారు.
🏠 Home