🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 15 Jun, 2026 | Page: 1

ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి


- బ్యాంకుల ముసుగు లో కూలీలను వేధిస్తే ఊరుకునేది లేదు

- సి ఆర్ గోవింద్ రాజ్ (సిపిఐ ) ఎం జిల్లా కమిటీ సభ్యులు*

- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి అశోక్

నారాయణపేట జిల్లా, జూన్ 17 (బి వి కే న్యూస్)

ఉపాధి హామీ పథకాన్ని యధావిదంగా కొనసాగించాలని బ్యాంకుల ముసుగు లో కూలీలను వేధిస్తే ఊరుకునేది లేదని
(సిపిఐ ) ఎం జిల్లా కమిటీ సభ్యులు సి ఆర్ గోవింద్ రాజ్,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి అశోక్ అన్నారు.
సోమవారం మక్తల్ మండలంలోని దాసరి దొడ్డి గ్రామంలో ఉపాధి కేంద్రాన్ని సందర్శించిన అనంతరం వ్యవసాయ కూలీలను ఉద్దేశించి వారు మాట్లాడారు వ్యవసాయ కార్మికులు పోరాడి సాధించుకున్న
మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కొనసాగించాల నీ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నీ నిర్వీర్యం చేసే కుట్రల భాగంగా పేరు మారుస్తూ విబిజీ రామ్ జి చట్టం తేవడం మహాత్ముని అవమానించడమే అన్నారు. వి బి జి రామ్ జి రద్దు కోసం పోరాడాలని వారు పిలుపునిచ్చారు.

కూలీలకు పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, పని ప్రదేశంలో రెండు పూటల ఫోటో క్యాప్సర్ తీసే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో మంచినీటి వసతి, ప్రతిరోజు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ, తట్ట, బుట్ట, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, పారలు, టెంట్లు సరఫరా చేయాలని కోరారు. అలాగే కొలతల పద్ధతిని రద్దుచేసి రోజు కూలి రూ'' 800 ఇవ్వాలని ఏడాదికి 200 పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు.


** జూన్ 20 నుండి జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4 వ మహాసభలను జయప్రదం చేయండి....


జూన్ 20 న ఉమ్మడి మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4 వ మహాసభ బహిరంగ సభకు ముఖ్య అతిథి : కామ్రేడ్ మాణిక్ సర్కార్ త్రిపుర మాజీ ముఖ్యమంత్రి హాజరవుతున్నారు. కేంద్ర నాయకులు రాష్ట్ర నాయకులు ఈ మహాసభలలో పాల్గొంటున్నారు.
ఈ మండలంలోని వ్యవసాయ కూలీలు, రైతులు, ప్రజలు, మహిళలు యువకులు, విద్యార్థులు మేధావులు అత్యధిక సంఖ్యలో పాల్గొని బహిరంగ సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో దాసరి దొడ్డి వ్యవసాయ కూలీలు లింగప్ప, వెంకటప్ప, గౌరప్ప, తిమ్మయ్య, శంకరప్ప, సూగమ్మ, వసంతమ్మ, మారెమ్మ, పద్మమ్మ, మలన్ బి, తాయమ్మ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home