కేరళలో నిఫా వైరస్ అలజడి
2018 నుంచి నిఫా వైరస్ వ్యాప్తి పదేపదే అలజడిని రేపుతూ, దేశవాసులను భయకంపితులను చేస్తున్నది. ఇప్పటి వరకు 24 మంది ప్రాణాలను తీసిన నిఫా వైరస్ విజృంభిస్తే ఏ స్థాయిలో ప్రభావాన్ని చూపుతుందే అంచనాలకు అందడం లేదు. ఈ ఏడాది తొలి నిఫా వైరస్ కేసు కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో 43 ఏండ్ల వ్యక్తికి బయట పడింది. ఈ వైరస్ సోకిన వ్యక్తి 10 జూన్ 2026 రోజున గుర్తించబడి ఐసొలేషన్ వార్డులో వెంటిలేటర్‌పై విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. వెంటనే భయపడాల్సినా పని లేదని వైద్యులు చెప్పినప్పటికీ కరోనా విపత్తు చేదు అనుభవాలు నేటి పౌర సమాజానికి కంటి నిండి కునుకు లేకుండా చేస్తున్నది. “హెనిపావైరస్ నిపాహెన్స్” జాతికి చెందిన నిఫా వైరస్ భారతదేశంతో పాటు మలేషియా, సింగపూర్ రోగుల్లో గుర్తించారు. తొలిసారి నిఫా నది ప్రాంతంలో గుర్తించిన కారణంగా దీనికి నిఫా వైరస్ అనే పేరును నిర్థారించారు.
నిఫా వైరస్ సోకిన రోగుల లక్షణాలు :
ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం, టెరోపోడిడే కుటుంబానికి చెందిన పండ్ల గబ్బిలాలు నిఫా వైరస్‌కు సహజ వాహకాలుగా లేదా అతిథేయ జీవులుగా నిర్థారించబడ్డాయి. నిఫా వైరస్ సోకిన గబ్బిలాలు, పందులు, పక్షులు, గుర్రాలు, కుక్కలు, పిల్లలు లేదా ఇతర జంతువుల నుండి మానవులకు వ్యాపిస్తున్నది. వైరస్ సోకిన 3 - 14 రోజుల వ్యవధిలో తీవ్రమైన వ్యాధి లక్షణాలు బయట పడతాయి. నేరుగా ఒకరి నుండి మరొకరికి కూడా ఇది వ్యాపించవచ్చని గమనించగలరు. నిఫా వైరస్ సోకిన వ్యక్తులుకు జ్వరం, తలనొప్పి, గందరగోళం, మెదడు వాపు, కండరాల నొప్పులు, వాంతులు, గొంతు నొప్పి, స్పృహలో మార్పులు, ఊపిరితిత్తుల సంబంధ లక్షణాలు (శ్వాస ఇబ్బందులు, దగ్గు) కనుపిస్తాయి. కేరళలో దట్టమైన వృక్ష సంపద ఉన్న ప్రాంతాల్లో ఈ పండ్ల గబ్బిలాలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. గబ్బిలాల శరీర ద్రవాలతో కలుషితమైన ఆహారం తినడం కూడా ఈ సమస్యకు దారి తీస్తున్నట్లు గమనించారు. ప్రస్తుతం కేరళ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తున్నది. బాధిత రోగికి దగ్గరి సంబంధం ఉన్న వ్యక్తులను కూడా క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
చెట్ల నుంచి కోసిన పండ్లను తినే ముందు శుభ్రంగా కడుక్కోవాలి. పక్షులు లేదా జంతువులు కొరికిన పండ్లను తినవద్దని వైద్యులు హెచ్చరికలు చేస్తున్నారు. భోజనం చేసే ముందు చేతులను తరుచుగా శుభ్ర పరుచుకోవడణ మరువరాదు. వ్యాధి సోకిన వ్యక్తులకు 40 - 75 శాతం మరణాల రేటు నమోదు అవడం ఓ ప్రమాదకర అంశంగా చూస్తున్నారు. పచ్చి కర్పూరపు రసం, ఈత కల్లు తాగడం ఉత్తమమని సూచిస్తున్నారు.
డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037