🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 14 Jun, 2026 | Page: 1

పార్టీ అభివృద్ధి కొరకు అంకితభావంతో పనిచేస్తా పదవుల కొరకు కాదు

- నారాయణపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్.సలీం

నారాయణపేట జిల్లా, జూన్ 14( బి వి కే న్యూస్ )
గత రెండు సంవత్సరాలుగా నారాయణపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించే అరుదైన అవకాశం నాకు కల్పించిన పార్టీ అధిష్టానానికి మరియు గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ. వాకిటి.శ్రీహరి గారికి, గౌరవ శ్రీ.డాక్టర్.చిట్టెం. పర్ణిక రెడ్డి గారికి,మరియు నన్ను రాజకీయంగా ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకొచ్చిన నా గురువు,మాబాస్ గౌరవ శ్రీ.కుంభం. శివకుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు నారాయణపేట పట్టణ మాజీ అధ్యక్షులు మొహమ్మద్ సలీం.

ఈ బాధ్యతను నేను ఒక పదవిగా కాకుండా,పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేసే ఒక పవిత్రమైన బాధ్యతగా భావించి నిర్వర్తించాను.ప్రతి కార్యక్రమంలో,ప్రతి పోరాటంలో, ప్రతి ప్రజా సమస్యపై కాంగ్రెస్ పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు నా వంతు కృషి చేశాను అంటూ తెలిపారు.

ఈ ప్రయాణంలో నాతో పాటు నడిచి నన్ను ప్రోత్సహించిన సీనియర్ నాయకులు, భుజం,భుజం కలిపి నాతో కలిసి నడిచిన పార్టీ కార్యకర్తలు, యువజన నాయకులు,మహిళా నాయకులు,పార్టీ అభిమానులు, మీడియా మిత్రులు మరియు పట్టణ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.మీ సహకారం,మీ నమ్మకం,మీ ప్రేమ లేకుండా ఈ ప్రయాణం సాధ్యమయ్యేది కాదు అన్నారు.

ఈరోజు పార్టీ అధిష్టానం కొత్త పట్టణ అధ్యక్షుడిని నియమించింది.వారికి నా హృదయపూర్వక అభినందనలు,
మరియు శుభాకాంక్షలు.వారి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు.

అధ్యక్ష పదవి ముగిసింది గానీ, కాంగ్రెస్ పార్టీ కోసం నా ప్రయాణం ముగియలేదు.పదవి అనేది ఒక బాధ్యత మాత్రమే... కానీ పార్టీ పట్ల అంకితభావం, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధత,ప్రజల పట్ల బాధ్యత నా జీవితాంతం కొనసాగుతాయి అంటూ పేర్కొన్నారు.

నాపై విశ్వాసం ఉంచిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.మీతో కలిసి నడిచిన ఈ రెండు సంవత్సరాలు నా జీవితంలో చిరస్మరణీయమైన అధ్యాయం.నేను ఎక్కడ ఉన్నా,ఏ బాధ్యతలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ జెండా కోసం,ప్రజల హక్కుల కోసం, సామాన్య కార్యకర్త గౌరవం కోసం నా స్వరం ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుందన్నారు .

నన్ను ప్రేమించిన వారికి, నన్ను విమర్శించిన వారికి కూడా ధన్యవాదాలు...
ఎందుకంటే ఈ రెండూ నన్ను మరింత బలంగా తీర్చిదిద్దాయి అంటూ తెలిపారు.

ఇప్పటి వరకు అందించిన సహకారం,ప్రేమ, ఆశీర్వాదాలు ఇకముందు కూడా ఇలాగే కొనసాగాలని కోరారు.

పదవి మారవచ్చు... బాధ్యత మారవచ్చు... కానీ కాంగ్రెస్ పార్టీ పట్ల నా అంకితభావం మారదు అన్నారు పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మహమ్మద్.సలీం.
🏠 Home