🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 14 Jun, 2026 | Page: 1

ఘనంగాపూర్వవిద్యార్థులఆత్మీయ సమ్మేళనం.



నారాయణపేట జిల్లా , జూన్ 14( బి వి కె న్యూస్ )

నారాయణపేట జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్ హాల్లో నారాయణపేట పట్టణంలోని ప్రభుత్వ అభ్యసన పాఠశాల 2004-05 పూర్వ విద్యార్థులు ఆదివారం ఒకే వేదికపై కలుసుకుని ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు.
ఒకే తరగతి గదిలో చదువుకొని వివిధ ఉద్యోగాలు వ్యాపార రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు 21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలవడంతో అలనాటి తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకుని ఆనంద భరితులయ్యారు.
తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి ఆశీస్సులుపొందారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆధ్యాంతం అత్యంత ఉత్సాహ భరితంగా కొనసాగింది. తమకు చదువు నేర్పిన ఉపాధ్యాయ బృందం అంబదాస్, ఆంజనేయులు, వినోద్ కుమార్, అనురాధ, శశికళ, హిమాన్షు కుమార్ తో పాటు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home