🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 14 Jun, 2026 | Page: 1

సమస్యల సుడి గుండంలో "వృద్ధ భారత్"



(వృద్ధుల రక్షణకు చట్టాలే సాథనం)

మానవ సమాజంలో అనుభవం ' జ్ఞానం ' వారసత్వ సంపదను' సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించే సమూహమే వృద్ధులు . మన దేశములో 60 యేళ్లు పైబడిన వారిని వృద్ధులు/ సీనియర్ సిటిజన్స్ అంటారు. మానవ జీవితంలో వృద్ధాప్యం అనివార్యమైన తప్పించుకోలేని దశ .ఈ వాస్తవాన్ని విస్మరించి అనేక కుటుంబాలు సమాజం వృద్ధులను భారంగా భావిస్తూ అనేక రకాలుగా వేధిస్తున్నారు.
వృద్ధులు వేదింపులు సామాజిక వేత్తల ఆందోళన
వృద్ధుల పై వేధింపులు ప్రపంచ వ్యాప్త సమస్య .అభివృద్ధి చెందిన 'అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వృద్ధుల అనాదరణ 'వేదింపులు వారిపై జరుగుతున్న పలురకాల హింస
జటిల సామాజిక సమస్యగా పరిణమించిందని సామాజిక వేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఐ'రా'స‌ వృద్ధుల సంక్షేమం చట్టాలు
.ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తన66/127 తీర్మానంద్వారా జూన్15 ను వృద్దులపై జరిగే వేదింపులు ఖండిస్తూ సభ్య దేశా లప్రభుత్వాలు వృద్ధుల సంక్షేమం సంరక్షణ కొరకు
సమగ్రమైన చట్టాల అమలు చేయాలని
సూచించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ వృద్ధుల దుర్వినియోగం నిర్లక్ష్యం పై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించింది. వృద్ధుల పై వేధింపులు ప్రతి , సమాజంలో సామాజిక లక్షణ మైంది.దానిని గుర్తించక పోవటం విచారకరం. వృద్దులు కుటుంబ సభ్యుల పరువు పోతుందనే భావముతో తమపై జరిగిన వేదింపులు బయటకు చెప్పలేక పోతున్నారు.

2026 సంవత్సరం థీమ్
కేవలం అవగాహన కల్పించడమే కాకుండా వృద్ధులపై జరిగే
వేధింపుల నివారణ క్షేత్రస్థాయిలో
సమర్థవంతంగా అమలుచేయడం.

పెద్దల నిర్లక్ష్యం రకాలు*
పెద్దల దుర్వినియోగం వివిధ రూపలలోవుంది . వృద్ధులను ప్రస్తుత సమాజం అనుత్పాధక వర్గంగా' భారంగా భావిస్తూ అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు.సామాజిక' ఆర్థిక ఆరోగ్య నిర్లక్ష్యం వృద్ధులకు శాపంగా పరిణమించింది.వృద్ధులకు ఆహారం‌ ఔషధాలు' భద్రత లేక‌ పోవడం ఉమ్మడి
కుటుంబాలు విచ్చిన్నం కావడం వల్ల వృద్దులు అనాధలుగా మారుతున్నారు. కొండంత భలగం ఉన్న వృద్ధులను ఆదుకొనే వారు కరువైనారు. పౌష్ఠికాహారం
పరిశుభ్రత 'సహాయం సకాలంలో వైద్య ఆరోగ్య చికిత్స లాంటి ప్రాథమిక అవసరాలు వారికి అందుబాటులో లేక పోవడం. వృద్ధులను బెదిరించడం అరవటం ' తిట్టడం కొట్టడం మొన్నగు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వృద్దులు ఎదుర్కొంటున్న ఆర్థిక' ఆరోగ్య సామాజిక 'సాంస్కృతిక సమస్యలను గుర్తించడం వృద్ధుల మీద జరుగుతున్న హింస నివారణ మీద చర్చలు సమావేశాలు నిర్వహించి వృద్ధుల సంక్షేమం పునరావాసం హక్కుల రక్షణకు ప్రభుత్వాలు విధానాలు రూపొందించాలి.
ప్రభుత్వాలు బడ్జెట్ కెటాయింపులో సంపద పంపిణీలో వృద్ధుల అభివృద్ధి సంక్షేమానికి ‌ప్రాధాన్యత ఇవ్వాలి.ఉచిత వైద్య సేవలు 'రావాణా సౌకర్యం కల్పించాలి .
ఐ'రా'స వృద్ధుల నిర్లక్ష్యం మానవ హక్కుల సమస్య
ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళిక పెద్దల దుర్వినియోగాన్ని మానవ హక్కుల సమస్యగా పెర్కోవడం గమనార్హం
ప్రపంచములో వృద్ధుల సంఖ్య
2030 నాటికి ప్రపంచ వృద్ధుల జనాభా 1.4 బిలియిన్స్ కు చేరుతుందని అంచనా వేయబడింది . జనాభాలో 4 నుండి‌‌ 6 శాతం వృద్దులు ఏదో ఒక రకమైన దుర్వినియోగానికి గురి అవుతున్నారని పలు సామాజిక ఆర్థిక ఆరోగ్య సర్వేలు వెల్లడిస్తున్నాయి
భారత దేశం వృద్ధుల గణాంకాలు
జనాభా లెక్కల ప్రకారం భారత దేశంలో వృద్ధుల జనాభా 1951 _ 1991 సం" రాల మధ్య 20 మిలియన్లు ఉండగా 1991- 2001 సం" రాల మధ్య 57 మిలియన్లకు పెరిగింది. 2050 నాటికి
వృద్ధుల సంఖ్య దాదాపు 324 మిలియన్ల కు పెరుగుతుందని అంచనా
ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో వృద్దులు వున్న దేశంగా భారత దేశం" వృద్ధాప్య దేశం" అనే గుర్తింపు పొందింధి.2001 గణాంకాల ప్రకారం 75 శాతం మంది వృద్దులు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు వృద్ధుల్లో 48.2 శాతం మహిళలు వీరిలో55 శాతం మంది వితంతువులు మొత్తం 73 శాతం మంది వృద్దులు నిరక్షరాస్యులు శారీరక శ్రమపై ఆధారపడిన వారు.రెక్కాడితే డొక్కాడని స్థితిలో జీవితాలను సాగదీస్తున్నారు .మూడింట ఒక వంతు మంది దారిద్ర్య రేఖ కింద జీవిస్తున్నారని నివేదికలో తేలింది. 66 శాతం మంది వృద్దులు తగిన ఆహారం దుస్తులు నివాసం లేకుండా దుర్భర పరిస్థితుల్లో జీవితాలు గడుపు తున్నారు. 90 శాతం మంది ప్రైవేట్ అసంఘటిత రంగానికి చెందిన వారు సాధారణ ఆదాయ వనరులు లేవు.కనీస అవసరాలు తీర్చుకోలేని దుర్భర పరిస్థితుల్లో జీవితాలు గడుపు తున్నారు.
వైద్య ఆరోగ్య సౌకర్యాలు పెరిగిన సగటు జీవితాలం భారత దేశములో 60 యేళ్లు వయసుపైబడిన వృద్ధుల సంఖ్య దాదాపు 17 కోట్లు వీరిలో 71 శాతం గ్రామాల్లో29శాతం.పట్టణాలలో నగరాలలో నివసిస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు మన దేశంలో ప్రజల సగటు జీవిత కాలం 32 సంవత్సరాలు దేశంలో ఆధునిక వైద్య ఆరోగ్య సౌకర్యాలు ఆదునిక చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాయి. పౌష్ఠికాహారం ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. జీవన ప్రమాణాలు మెరుగుపడటం వల్ల నేడు ప్రజల సగటు జీవిత కాలం 70 ఏళ్ళకు పెరిగింది.
దేశంలో వృద్ధులు సమస్యలు
వృద్ధులు అనేక ఆరోగ్య 'ఆర్థిక మానసిక 'సామాజిక సమస్యలను ఎదుర్కుంటున్నారు. దేశంలో వృద్దులు దంద్వ వైద్య సమస్యలతో బాధపడుతున్నారు అనగా సంక్రమించే మరియు నాన్ కామ్యునికేబుల్‌ వ్యాధులతో బాధ పడుతున్నారు . 70 శాతం కంటి చూపు సమస్య16 శాతం వినికిడి సమస్య46 శాతం గుండె జబ్బులు21 శాతం మధుమేహం 12 శాతం నిద్రలేమి ఒత్తిడి మానసిక సమస్యలతో బాధపడుతున్నారు.
రోగ నిరోధక శక్తి క్షీణత వయసు సంభంధిత శారీరక మార్పులు అంటువ్యాధులు క్షయ లాంటి వ్యాధులను వృద్దులు ఎదుర్కుంటున్నారు . శ్వాస కోశ రుగ్మతల వల్ల 10 శాతం మరణాలకు కారణమవుతున్నాయి.81 శాతం వృద్దులు ఆధునిక సమాజములో పెరుగుతున్న ఒత్తిడి మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు.77 శాతం మంది అత్తగారు కోడళ్ళ మధ్య విబేధాలు ఉన్నట్లు సర్వేల్లో తేలింది.
వృద్ధులు మానసిక ఒత్తిడి
ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులు9 శాతం ఉన్నారు. హెల్ప్ ఏజ్ ఇండియా చేసిన సర్వే ప్రకారం47 శాతం.వృద్ధులు తమ ఆర్థిక ఆరోగ్య అవసరాల కోసం తమ సంతానం మీద ఆధారపడి జీవిస్తున్నారు.37 శాతం ప్రభుత్వం అందించే పెన్షిషన్స్ మీద ఆధారపడి జీవితాలను నెట్టుకొస్తున్నారు.వృద్ధుల్లో సగం మంది తీవ్ర మానసిక ఒత్తిడి తో జీవితాలను గడుపుతున్నారు. ఉద్యోగ రీత్యా పిల్లలు ఒక చోట వృద్ధులు మరొక చోట విదేశాల్లో కొలువులు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు చూసే వారు లేక ఆదరించే.వారు లేక మానసికంగా కుంగి పోతున్నారు.
ప్రపంచీకరణ విదేశీ మోజు
పారిశ్రామికీకరణ పట్టణీకరణ ప్రపంచీకరణ కార్పొరేటీకరణ సాంకేతిక అభివృధి ఆధునిక చదువులు యువత సంఖ్య అధికంగా ఉండడం విదేశీ చదువు విదేశీ కొలువు పై మోజు ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నం కావడం వల్ల దేశ జనాభాలో 12 శాతం ఉన్న వృద్ధుల్లో మహిళలు పురుషులు వృద్ధాశ్రమాల్లో జీవిస్తున్నారు.

వృద్ధులు కుటుంబ సభ్యుల నిరాదరణ కుటుంబ సభ్యుల నిరాదరణ వేదింపులు నిర్లక్ష్యం వృద్దులకు నిత్యకృత్యం కావటం సామాజిక లక్షణంగా దాపురించింది.
రాజ్యాంగ హక్కులు చట్టాలు అవగాహన వృద్ధుల సంరక్షణ కొరకు చట్టాలు పలు పథకాలు రాజ్యాంగ పరమైన హక్కులు ఉన్నాయి. రాజ్యాంగంలోని 41 ' 46 ప్రకరణలు వృద్ధుల సౌకర్యం గురించి తెలియచేస్తున్నాయి. భారతీయ హిందూ వివాహ చట్టం1956 లోని 20 వ సెక్షన్ వృద్ధుల తల్లి తండ్రుల సంరక్షణ బాధ్యత గురించి చెబుతుంది. సి'పి'సి లోని 125 వ సెక్షన్ తల్లి తండ్రులు తమ సంతానం నుండి జీవనభృతి కోరవచ్చు. వృద్ధులు తల్లి తండ్రుల నిర్వహణ సంక్షేమ చట్టం2007 ప్రకారం వారసులు తమ సంతానం వృద్ధుల కనీస అవసరాలు తీర్చాలి సంరక్షించాలి.
వృద్ధులు క్షమా గుణం
వేదింపులకు గురైనవృద్దులు తరచుగా నేరస్థులను రక్షించమని వేడుకుంటారు. క్షమా గుణం వృద్ధుల్లో వుండటం వల్ల వారి పై జరిగే వేదింపులు హింస సమాజానికి తెలియడంలేదు.
వృద్ధులు సంరక్షణ చట్టం
వృద్ధుల దుర్వినియోగం వృద్ధులపై‌ వేదింపులు జరిగినపుడు
పోలీసులకు లేదా స్థానిక దుర్వినియోగ నిరోధక సంస్థకు నివేదించాలి. వృద్ధుల వేదింపులు నివారణకుకావలసిన సమాచారాన్ని అందించే.నేషనల్ సెంటర్ ఆన్ లా& ఎల్డర్స్ రైట్స్ "savvy saving seniors ".లాంటి పోర్టర్లు అందుబాటులో ఉన్నాయి.
వృద్ధుల వేదింపులకు సంబంధించిన వార్తలు సమాచారాన్ని మీడియా సోషల్ మీడియా ప్రచారం చెయ్యాలి.
ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ సామాజిక భద్రత మంత్రిత్వశాఖ
దారిద్ర్య రేఖకు దిగువన వున్న వృద్దులకు చూపు వినికిడి దంత సమస్యలతో భాద పడుతున్న వారికి "రాష్ట్రియ వయో శ్రీ యోజన" ద్వారా ఆర్థిక సాయం అందచేస్తున్నారు.
వృద్దులకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి వయ "వందన యోజన"ను తీసుకొచ్చింది.60 ఏళ్ళకు పై బడిన వారి కోసం "సేక్రేడ్ పోర్టల్ ఫర్ ఏల్డర్స్"
కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టింది.
రైల్వేస్ ప్రయాణ ఛార్జీలు ' ఇన్కాంటాక్స్ బెనిఫిట్స్ 'రావాణా 'వడ్డీ ఆదాయ పన్ను రాయితీలు మినహాయింపులు ప్రవేశం
పెట్టి వృద్ధులను ఆదుకుంటున్నారు.

స్వచ్చంధ సంస్థలు కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
వివిధ స్వచ్ఛంద' సామాజిక సేవా సంస్థలు' పౌరసమాజం వృద్ధుల వేదింపులను అరికట్టడానికి కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి .
చట్టాలపై అవగాహన ఉచిత న్యాయ సహాయం(ఫ్రీ లీగల్ ఎయిడ్) ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ న్యాయ శాఖ సంయుక్తంగా కుటుంబ సభ్యులకు వృద్ధుల ఆరోగ్యం సంరక్షణ చట్టాల మీద అవగాహన సదస్సులు సమావేశాలు నిర్వహించాలి.ప్రభుత్వం వృద్దులకు న్యాయ పరమైన ఇబ్బందులు పరిష్కరించడానికి లోక అదాలత్ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందించాలి. వృద్దులు తాము సంపాదించిన ఆస్తిలో50 శాతం వారి పేరు మీద రిజిస్టర్ చెయ్యాలి ఆస్తి మీద హక్కులు కల్పించాలి. ఆస్తిని అమ్ముకునే హక్కు అనుభవించే హక్కు కల్పించాలి. ప్రస్తుతo ఉన్న చట్టాలను కఠినంగా అమలు చెయ్యాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వృద్దులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వృద్దులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి.
తల్లి తండ్రులను పోషించని ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
వృద్ధుల సంపాదన ఆస్తిని వారసత్వంగా పొందే కుటుంబ సభ్యులు వృద్ధుల సంరక్షణ వారి భద్రత బాగోగులు మీద శ్రద్ద పెట్టాలి.
కుటుంబ సభ్యులు వృద్ధుల సంరక్షణ సంక్షేమ చట్టాల మీద అవగాహన పెంచుకోవాలి.
మానవీయ విలువలు పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టాలి ప్రభుత్వం నూతన విద్యావిధానంలో బాగంగా పాటశాల' కలాశాల స్థాయిలో "వృద్దుల సంరక్షణ "మానవీయ విలువలు" సామాజిక విలువలు 'ఆధ్యాత్మికత తత్వ శాస్త్రాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి .
రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న వృద్ధాప్య పింఛన్లు గుర్తింపు ఎంపికలో జరుగుతున్న లోటు పాట్లు సవరించాలి. సాంఘిక భద్రత ఉచిత ఆరోగ్య సౌకర్యాలలో చోటు చేసుకుంటున్న అవినీతి అక్రమాలను ప్రభుత్వం అరికట్టాలి వృద్ధుల సామాజిక భద్రత ఆరోగ్యం పునరావాసం వినోద సౌకర్యాలు కలిపించాలి.గ్రామీణ వయోవృదుల ఆరోగ్య సంరక్షణ గా పిలువ బడేICMR
ప్రాజెక్ట్ ను అందుబాటులో వుంచాలి.
సమతుల్య ఆహారం శారీరక వ్యాయామం అవగాహన యోగ మెడిటేషన్ కార్యక్రమాలలో వృద్దులు భాగస్వాములు కావాలి.
వృద్ధుల సంక్షేమ పథకాలు కళారూపాల ద్వారా ప్రచారం
ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన పథకాల పట్ల గ్రామీణ ప్రాంతాల్లో యువజన సంఘాలు ఎన్'ఎస్'ఎస్ ఎన్.సి'సి విద్యార్థి సంఘాలు వివిధ కళా రూపాల ద్వారా ప్రచారం చెయ్యాలి.
ఎలక్ట్రానిక్ మీడియా ' సినిమా' టి' వి పత్రిక ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చెయ్యాలి.
వృద్ధుల సంక్షేమం కోసం 2019 లో తల్లి తండ్రుల సంరక్షణ సవరణ చట్టం బిల్లు ప్రభుత్వం తీసుకు వచ్చింది దానిని పార్లమెంట్ ఆమోదించాలి.
వృద్ధుల సంక్షేమం ప్రజాప్రతినిధులు ప్రతి అసెంబ్లీ ' ప్రతి పార్లమెంట్ పరిధిలో సీనియర్ సిటిజన్స్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రతి 3 నెలలకు ఒక సారి ప్రభుత్వ సంబంధిత అధికారులతో సీనియర్ సిటిజన్స్ చట్టాల అమలు సంరక్షణ సంక్షేమ పథకాల అమలును ఆయా నియోజక వర్గం శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు సమీక్ష సమావేశాలు నిర్వహించాలి.
వృద్ధుల పట్ల కుటుంబ సభ్యులు సమాజం గౌరవభావంతో ప్రేమానురాగాలు ఆత్మీయతతో మెలిగే వాతావరణం కలిపించాలి.వృద్దులు వద్దు ఆస్తులు ముద్దు అనే సామాజిక మానసిక వైఖరిలో సమగ్ర మార్పులు రావాలి. వృద్ధుల సేవలో తరించే నూతన మానవీయ సంస్కృతి మొగ్గ తొడగాలి.ప్రభుత్వ…
🏠 Home