🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 13 Jun, 2026 | Page: 1

సెమీఫైనల్లో సింధు

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో మూడో సీడ్‌ సింధు 21-6, 21-9తో చెన్‌ సుయు(చైనీస్‌ తైపీ)పై అలవోక విజయం సాధించింది. ఈ సీజన్‌లో సింధు రెండో సెమీఫైనల్‌.మరో సింగిల్స్‌ క్వార్టర్స్‌లో యువ షట్లర్‌ తవెన్వ శర్మ 14-21, 14-21తో టాప్‌సీడ్‌ జపాన్‌ షట్లర్‌ అకానె యమగూచి చేతిలో ఓటమిపాలైంది. శనివారం జరిగే సెమీస్‌లో యమగుచితో సింధు తలపడనుంది. పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌లో భారత జోడీ హరిహరణ్‌- ఎమ్‌ఆర్‌ అర్జున్‌ మ్యాచ్‌ మధ్యలోనే నిష్ర్కమించింది.
🏠 Home