🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 12 Jun, 2026 | Page: 1

ఒత్తిడిని తగ్గించే బ్రహ్మాస్త్రం యోగాస్త్రం

(జూన్21 అంతర్జాతీయ
యోగా దినోత్సవం
సందర్భంగా రాసిన కవిత)

ఉరుకుల పరుగుల జీవితంలో
అలసిపోతున్న మనసు కోసం
ఒత్తిడిని దూరం చేసే అస్త్రం
మన ప్రాచీన యోగాస్త్రం

జూన్ 21వ తేదీన ప్రపంచ
మంతా జరుపుకునే పండుగ
జాతి మత ప్రాంతం భేదం
లేనిది ఈ అంతర్జాతీయ
యోగా దినోత్సవం

ఒత్తిడిని ఆందోళనలను తగ్గించే
దివ్యమైన బ్రహ్మాస్త్రం యోగాస్త్రం
చిరునవ్వును మరవని మనిషి
జీవితంలో తెలియని అలసట
నింపే ఈ హైటెక్ కాలంలో
సమస్యల సుడిగుండంలో చిక్కిన
మనసుకు యోగాసనమే కదా
ఒక దివ్యమైన ప్రకృతి చికిత్స
సమస్త రోగాలను హరించే
దివ్యాస్త్రం ఈయోగాస్త్రం

అలసిన మదికి అమృతం యోగ
కలతనుతీర్చే దివ్య ఔషధం యోగ
ఆలోచనల సుడిగుండంలో చిక్కిన
మనసుకు స్వాంతతను ఇస్తుంది

నిత్యం చేసే యోగా ధ్యానం
వల్ల శ్వాసపై నియంత్రణ పెరిగి
ప్రాణాయామంతో రోగనిరోధకత
పెరిగి ఆరోగ్యానికి రక్షణ కవచమై
నిలుస్తుంది

శ్వాసపై ధ్యాస నిలిపి చూడు
తరిమి కొడుతుంది నీలోని
నైరాశ్యపు వేదనలను
ఆసనాల మేళవింపుతో
శరీరత ధారుడ్యత పెరిగి
ప్రాణాయామ శక్తితో
అంతరంగం వెలిగిపోతుంది
ఒత్తిడి తీవ్రత తగ్గుతుంది

సమాజం వల్ల కలిగే
ఒత్తిడిలు తట్టుకొని
నీలో దాగి ఉన్న అనంత శక్తిని
మేల్కొలిపి మనోనిబ్బరాన్ని
ఇచ్చే ఏకైక సాధనం యోగ

యోగతో మనసులోని
కల్మషాలు మాయమవుతాయి
ఇమ్యూనిటీ స్థాయి పెరిగి
అయుఃప్రమాణం పెరుగుతుంది

కఠినమైన ఆసనాల
సాధనతో శారీరక ద్రుడత్వం
సొంతమవుతుంది
ఆసనాల సాధనతో
శరీరంపై నవయవ్వనం
తొణికిసలాడుతుంది

ధ్యాన ముద్రలతో మనసు
ప్రశాంతతను పొంది నూతన
ఆలోచనలను సృజనాత్మకతను
ఆవిష్కరిస్తుంది

జీవన సాఫల్యతకు
సంతృప్తి కర జీవనానికి
యోగయే ఉత్తమమార్గం

ఆలోచనల అలజడిని
అణిచివేసే బ్రహ్మాస్త్రం యోగాస్త్రం
అంతర్గత ప్రశాంతతను
చేకూర్చే సాధనం యోగాస్త్రం

యోగ సాధన జీవనశైలిలో
భాగం చేసుకోవాలి
రోజు ఉదయం లేవగానే
యోగాకు కొద్దినిమిషాలు
కేటాయిస్తే శరీరానికి వస్తుంది
కొత్త బలం మనసుకు
దొరుకుతుంది ప్రశాంతత

ప్రతిరోజు ఉత్సాహంతో
యోగ సాధన చేస్తే
నూతన ఉషోదయం
మొదలవుతుంది
రోజంతా ఉల్లాసం
ఉరకలు వేస్తుంది

నిత్యజీవితంలో
యోగను భాగం చేసుకుంటే
ఒత్తిడి దూరమై ఆరోగ్యం
మన సొంతమవుతుంది
యోగకు కులం లేదు
మతం లేదు సరిహద్దుల
గీతల్లేవు
యోగాసనం సాధనలో
అందరూ ఒకటే
విశ్వ వేదికపై భారతావని
చాటిన యోగా విజ్ఞాన
ఆరోగ్య జెండా ఎగిరేద్దాం
మానవాళికి అందించిన
ఆరోగ్య వరప్రసాదమైన
యోగాతో
ప్రపంచాన్ని ఏకం చేద్దాం

శ్వాసపై మనం ధ్యాస పెడితే
కోపతాపాలు తగ్గిపోతాయి
ఆసనాలు క్రమంగా వేస్తే
రోగాలు దరిచేరవు

డబ్బులు ఖర్చు లేని మందు
నిత్యం చేసే యోగా సాధన
ఒత్తిడిని గెలిచే బ్రహ్మాస్త్రం
మనందరి ఆరోగ్యానికి
ఆయుధం యోగాస్త్రం

తనువును మనసును ప్రకృతితో
ముడివేసే బంధం యోగం
యోగ సాధనతో ఆందోళన
రహిత సమాజ స్థాపనకు
పాటుపడుదాం
యోగా చేద్దాం రోగాలను
తరుముదాం
ఆరోగ్య భారత్ ను ఆవిష్కరిద్ధాం

నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
సలహాధారులు
అత్తాపూర్ యోగ సెంటర్
హైదరాబాద్
9440245771

🏠 Home