ఏదీ దాచిపెట్టలేదు.. మీనాక్షీ నటరాజన్
న్యూఢిల్లీ:న్యూఢిల్లీ కాంగ్రెస్ నేత మీనాక్షీ నటరాజన్మధ్యప్రదేశ్ నుంచి దాఖలు చేసిన రాజ్యసభ నామినేషన్‌ను స్థానిక రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టును ఆమె ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఆ అంశం కోర్టు పరిధిలో ఉందని, సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని, లీగల్ అంశాలపై తాను ఎక్కువ లోతులో మాట్లాడలేనని తెలిపారు. కానీ ఈ సమస్యకు సంబంధించిన వివరాలన్నీ ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉన్నట్లు ఆమె చెప్పారు.