కలశం చెంబులో తాళం పెట్టడం వల్లే.. 7.8 కిలోల బంగారం, కిలోన్నర వెండిని సులువుగా దోచేసిన దొంగలు!
ఇంట్లో ఎంత పటిష్టమైన భద్రతా లాకర్లు ఉన్నా, చిన్నపాటి నిర్లక్ష్యం వహిస్తే.. ఎంతటి ముప్పు తెస్తుందో నిరూపించే ఘటన గచ్చిబౌలిలో జరిగింది. ముఖ్యంగా ఇటీవలే గచ్చిబౌలిలోని ఓ విల్లాలో 7.8 కిలోల బంగారు ఆభరణాలతో పాటు కిలోన్నర వెండి చోరీకి గురైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో ఇప్పటికే నిందిలను పోలీసులు అరెస్ట్ చేయగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కోట్లాది రూపాయల సంపదను దాచుకోవడానికి అనేక లాకర్లను ఏర్పాటు చేసుకున్నసదరు వ్యాపారవేత్త.. దానికి సంబంధించిన తాళం చెవిని మాత్రం పక్కనే ఉన్న పూజా కలశం చెంబులో దాచాడు. అదే అతడి కొంప ముంచింది. పని మినిషులు సులువగా బంగారం దోచేసేందుకు వరంగా మారింది.
ఆ కలశం చెంబే దొంగలకు దారి చూపింది..!
పోలీసుల కథనం ప్రకారం.. గచ్చిబౌలిలోని ప్రముఖ హిల్ రిడ్జ్ గేటెడ్ కమ్యూనిటీలోని విల్లా నంబర్ 73లో ప్రకాశ్ పాయ్ (73) తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. సుమారు 20 రోజుల క్రితం నేపాల్‌కు చెందిన సురేశ్ అనే వ్యక్తి ద్వారా విమలా షాహీ, కమల్ షాహీ అనే భార్యాభర్తలను వీరు ఇంట్లో పని మనుషులుగా పెట్టుకున్నారు. ఈ దంపతులు విల్లాలోని సర్వెంట్ క్వార్టర్స్‌లోనే ఉంటూ పనులు చూసుకునేవారు. అయితే విల్లా గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఓ గదిలో రెండు భద్రతా లాకర్లు ఉన్నాయి. యజమాని ప్రకాశ్ పాయ్ వాటి తాళం చెవిని ఎప్పుడూ లాకర్ పైన ఉండే ఒక కలశం చెంబులోనే దాచే అలవాటు ఉంది. ఈ విషయాన్ని గమనించిన నేపాలీ దంపతులు ఎలాగైనా ఇల్లు గుల్ల చేయాలని పథకం వేశారు.
పెళ్లికి వెళ్లిన కుటుంబం.. పక్కా స్కెచ్‌తో దోపిడీ!
ఈ నెల 6వ తేదీన ఢిల్లీలోని తమ బంధువుల ఇంట్లో జరిగే ఒక శుభకార్యానికి హాజరయ్యేందుకు ప్రకాశ్ పాయ్ తన భార్య వందన, కుమారుడు అభిజిత్‌లతో కలిసి వెళ్లారు. వెళ్లేటప్పుడు కూడా ఎప్పటిలాగే తాళం చెవిని ఆ చెంబులోనే పెట్టి వెళ్లారు. యజమాని కుటుంబం వెళ్లిన వెంటనే ఈ దంపతులు తమకు పని కుదిర్చిన సురేశ్‌కు సమాచారం ఇచ్చారు. ముగ్గురూ కలిసి పక్కా ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగారు. ముందుగా బాల్కనీ గ్లాస్ పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. అక్కడ వినాయకుడి ఫొటోకు ఉన్న 4 తులాల బంగారు గొలుసును దొంగిలించారు. ఆ తర్వాత లాకర్ పైన ఉన్న చెంబులో నుంచి తాళం చెవి తీసి, లాకర్‌ను తెరిచారు. అందులో ఉన్న దాదాపు రూ. 5 కోట్ల విలువైన 5 కిలోల బంగారు, వజ్రాభరణాలను, నగదును బ్యాగుల్లో సర్దేసుకున్నారు.