🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 12 Jun, 2026 | Page: 1

పొలిటికల్​ ఎంట్రీపై రాఘవ లారెన్స్‌ బిగ్​ అప్డెట్​

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌ రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం గత కొంతకాలంగా జోరుగా సాగుతోంది. అయితే, పొలిటికల్​ ఎంట్రీపై లారెన్స్​ తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నట్లు తానే స్వయంగా ప్రకటిస్తూ ఎక్స్​లో ఒక వీడియో పోస్టు చేశారు. ప్రజలు, అభిమానులు ఆమోదిస్తే తాను రాజకీయ ప్రయాణం ప్రారంభిస్తానని, లేదంటే ఈ ఆలోచన విరమించుకుంటానని లారెన్స్‌ స్పష్టం చేశారు.

"నేను రాజకీయాల్లోకి వెళ్తానని చెబితే నా తల్లి అంగీకరించింది. నా జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనల నుంచి నేను రాజకీయాలపై స్పూర్తి పొందాను. అయితే, రాజకీయాల్లోకి రావాలన్న నా నిర్ణయం సరైనదో కాదో నా అభిమానులు, ప్రజలే చెప్పాలి. మీరు ఒకే చెబితే, రాజకీయ ప్రయాణాన్ని ఎప్పుడు ప్రారంభిస్తానో స్పష్టతనిస్తా. ఒకవేళ మీరు వద్దంటే ఈ ఆలోచనను మానుకొని, ఎప్పటిలాగే సమాజం కోసంచేసే నా సేవలను కొనసాగిస్తా" అని రాఘవ లారెన్స్ వీడియో సందేశంలో పేర్కొన్నారు.​
🏠 Home