12 నుంచి 4కు దిగిన గ్యాస్ సిలిండర్లు - మళ్లీ కట్టెల పొయ్యే దిక్కయ్యేనా?
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోంది. ముఖ్యంగా భారత్‌లో వంటగ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరలు సామాన్యుల మెడకు గుదిబండగా మారాయి. వీటన్నింటికీ తోడు ప్రస్తుతం సిలిండర్ల సంఖ్య తగ్గిపోయింది. గతంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద రాయితీపై తొమ్మిది సిలిండర్లు ఇస్తుండేది. ఇప్పుడు ఆ సంఖ్యను నాలుగుకు కుదించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మధ్య తరగతి కుటుంబాలకు ఇక్కట్లు తప్పవని తెలుస్తోంది!
పేదలకు భరోసాగా ఉజ్వల పథకం : మోదీ ప్రభుత్వంలోకి వచ్చాక పేద ప్రజలకు భరోసాగా 2016లో కేంద్రం ఉజ్వల పథకాన్ని ప్రారంభించింది. వంటింట్లో కట్టెల పొయ్యితో ఇబ్బందులు పడుతున్న వారికి ఉచితంగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయటమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద ప్రభుత్వం ముందు ఏడాదికి 12 సిలిండర్లను రాయితీపై అందించారు. పోయిన సంవత్సరం ఆ సంఖ్యను 9కి తగ్గించారు. ఇక ఇప్పుడు అది 4కు చేరింది. దీంతో ప్రజలు ఏడాది మొత్తం నాలుగు సిలిండర్లతో బతుకు బండి నడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
కొత్త కనెక్షన్లకు తంటాలు : ఇప్పటి వరకు కొత్త కనెక్షన్లు కావాల్సి వస్తే రేషన్, ఆధార్ కార్డులను సమర్పిస్తే సరిపోయేది. ఉజ్వల పథకం కింద కొత్త గ్యాస్ స్టౌతో పాటు సిలిండర్‌లను ఏజెన్సీలు ఉచితంగా మంజూరు చేసేవారు. అయితే గత రెండు నెలలుగా కొత్త గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేయడానికి ఏజెన్సీలు ఆలోచిస్తున్నాయి. గతంలో ఏడాదికి 12 సిలిండర్లు ఇచ్చేవారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌పై రూ.300 వరకు రాయితీ కూడా ఇచ్చేది. ఆ రాయితీని లబ్ధిదారుల ఖాతాల్లోనే నేరుగా జమ చేసేవారు.
10 నుంచి 15 రోజుల జాప్యం : యుద్ధం కారణంగా గ్యాస్ సిలిండర్ల కొరత రోజురోజుకూ పెరుగుతోంది. బుకింగ్ చేసిన 10 నుంచి 15 రోజులకు సిలిండర్లు ఇంటికి వస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో వంటింట్లో అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు ఉజ్వల పథకం కింద ఒకే సిలిండర్ తీసుకున్న లబ్ధిదారులకు డబ్బులు చెల్లిస్తామన్నా మరో సిలిండర్ ఇవ్వడం లేదు.
మళ్లీ కట్టెలపొయ్యే దిక్కయ్యేనా? : ఒకప్పుడు కట్టెల పొయ్యితో నిరుపేదలు కష్టాలు పడుతున్నారనే ఉద్దేశంతో ఉజ్వల పథకాన్ని ప్రారంభించారు. కానీ ప్రస్తుతం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలతో మళ్లీ కట్టెల పొయ్యే దిక్కయ్యేలా ఉంది. ఓపైపు రాయితీపై కోత విధిస్తూనే, మరోవైపు తాజాగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌పై రూ.29 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర పలు ప్రాంతాల్లో రూ.984 నుంచి రూ.1,013కి చేరింది.