బాల్యంలో శారీరక, మానసిక వికాసానికి ఆటలు తప్పనిసరి !
(11 జూన్ “అంతర్జాతీయ ఆటల దినోత్సవం” సందర్భంగా)
ఆటలు పిల్లల జన్మ హక్కు. బాల్యం ఆటలకు నెలవు. ఆటల్లో ఆనందాన్ని పొందడం చిన్నారులకు ఇష్టమైన ఏకైక దినచర్య. పిల్లలు, పాఠశాల విద్యార్థినీవిద్యార్థులు, యువత తప్పక ఆటలకు కొంత సమయాన్ని కేటాయించాలి. ఆటలతో అనేక ప్రత్యక్ష ప్రయోజనాలు ఉన్నాయి. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి, వ్యక్తిత్వ వికాసానికి ఆటలు దోహదపడతాయి. చిన్నారుల్లో సృజనశీలత పెంచడం, సామాజిక నైపుణ్యాలను వృద్ధి చేయడం, ప్రపంచ పోకడల గూర్చి అవగాహన పరుచుకోవడం ఆటలతో సుసాధ్యం అవుతుంది. ఆటల ద్వారా పిల్లలు తమ బావోద్వేగాలను వ్యక్తం చేయడం, నిలకడను అలవర్చుకోవడం, కొత్త విషయాలను నేర్చుకోవడం, అమిత సంతోషాలను పొందడం జరుగుతుంది. ఆటలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పిల్లల్ని ఆల్-రౌండర్లుగా తీర్చిదిద్దడంతో పాటు వారి ఉజ్వల భవితకు గట్టి పునాదులు వేయడం, ఆత్మవిశ్వాసంతో కూడిన బాధ్యతగల పౌరులుగా తయారు చేయడానికి తల్లిదండ్రులు, సంరక్షకులు, ఉపాధ్యాయులు, విద్యాలయ యాజమాన్యాలు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి.
అంతర్జాతీయ ఆటల దినోత్సవం:
ఆటలు ఒక వినోదాన్ని అందించే వేదికలు మాత్రమే కాదని, అన్ని వర్గాల, వయస్సుల వారికి ఆటలు ఒక సార్వత్రిక భాషగా జాతీయతాభావం, సాంస్కృతిక వికాసం, సామాజిక-ఆర్థిక ప్రగతి ముడిపడి ఉంటాయి. పిల్లలకు ఆటల ప్రాధాన్యాన్ని గుర్తించిన ఐరాస చొరవతో ఆటల ప్రయోజనాలను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సంరక్షకులు, విద్యాలయ యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, పౌర సమాజానికి వివరించడానికి ప్రతి ఏట 11 జూన్ రోజున “అంతర్జాతీయ ఆటల దినోత్సవం (ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లే)” పాటించడం ఆనవాయితీగా మారింది. 2026 అంతర్జాతీయ ఆటల దినం ఇతివృత్తంగా “ఆటను రక్షించండి, బాల్యాన్ని రక్షించండి (ప్రొటెక్ట్ ప్లే, ప్రొటెక్ట్ చైల్డ్‌హుడ్)” అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. పిల్లలకు చేరువగా ఆటలు తీసుకురావడానికి ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, పౌర సమాజం కూడా ప్రాధాన్యతాక్రమంలో చొరవ చూపాలి. ఆటల సంస్కృతిని కాపాడడం, ప్రోత్సహించడం, అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పిల్లల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని తెలుసుకోవాలి.
ఆటలతో బహుళ ప్రయోజనాలు:
నేర్చుకోవడానికి ఓ శక్తివంతమైన వేదిక ఆట స్థలం మాత్రమే. ఆటలతో పిల్లల్లో మేధో, సామాజిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక, మానసిక, శారీరక అభివృద్ధి జరుగుతుంది. ఆటల ద్వారా జట్టుతో కలిసి పని చేయడం (టీమ్ స్పిరిట్), క్రీడా స్ఫూర్తి పెంపొందించబడడం, నాయకత్వ లక్షణాలు పెరగడం, నిలకడను నేర్చుకోవడం, సామాజిక సవాళ్లను ఎదుర్కోవడం, ఓటమిని ఆకళింపు చేసుకోవడం, భయాన్ని జయించడం లాంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఊహాశక్తి, సృజనశీలత, ఆవిష్కరణ ద్వారాలు తెరుచుకుంటాయి. ఆటల ద్వారా పాఠాలు సులభంగా అర్థం కావడం, సమగ్ర శ్రేయస్సు ఒనగూడడం, ఆశావహ దృక్పథం పెరగడం జరుగుతుంది. ఆటలు పిల్లల్లో మానసిక ఉత్సాహాన్ని, శారీరక దృఢత్వాన్ని కలిగిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాలు, సంక్షోభాలు, విపత్తుల సమయంలో పిల్లల పరిస్థితులు దుర్భరంగా ఉంటాయి. ఇలాంటి సమయాల్లో పిల్లల్ని సంతోష పెట్టడానికి ఆటలు మాత్రమే సరైన సాధనాలుగా పని చేస్తాయి.
ఆటల ప్రాధాన్యం తెలియని పెద్దలు :
నేటి విద్యావిధానంలో ర్యాంకులు, మార్కులు, గ్రేడ్ల వరదల్లో తల్లిదండ్రులు కూడా కొట్టుకుపోతున్నారు. పిల్లలు ఆడు కావడానికి తల్లిదండ్రులు సరైన సమయం కూడా ఇవ్వడం లేదు. ప్రపంచవ్యాప్తంగా 78 శాతం మంది పేరెంట్స్ ఆటలు అవసరమని భావించడంతో లేదని, 73 శాతం మంది పిల్లలు తమ తల్లితండ్రులు అనుమతించడం లేదని తెలపడం విచారకరం. పేదరికం, అవిద్య, సంక్షోభాలు, విపత్తులు, వివక్ష లాంటి అంశాలు పిల్లలను ఆటలకు దూరం చేస్తున్నాయి. ఆటల రూపంలో పాఠాలు నేర్పడం ఓ మహోన్నత బోధన పద్దతి అని నేడు ప్లే స్కూల్స్ పేరుతో పాఠశాలలు వెలుస్తున్నాయి. ఆటల ఆధార బోధనలు పిల్లలకు సంతోషాలతో కూడిన చక్కటి, సులభమైన అవగాహనను కల్పిస్తున్నాయి. ఆటల ద్వారా పిల్లలకు ఓపిక, సహనం, సామాజిక సమ్మిళిత భావనలు, సంక్షోభాల నివారణ, శాంతి స్థాపన లాంటివి ఒనగూడుతాయి.
పిల్లలు ఆడుకోకవం వారి కనీస మానవ హక్కు. అలాంటి ఆడుకునే హక్కును హననం చేస్తే పిల్లల ఉజ్వల భవితకు తీవ్ర విఘాతం కలుగుతుంది. పిల్లల జీవితంలో ఆటలు ఓ చక్కటి ప్రవర్తనకు మార్గం చూపుతాయి. ప్రపంచ పోకడలను ఆకళింపు చేసుకోవడం, విశ్వ రహస్యాలను ఆవిష్కరించుకోవడం, తమ లక్ష్యాలు ధైర్యంగా చేరుకోవడం, చక్కటి సంభాషణాచాతుర్యాన్ని అలవర్చుకోవడం, భావోద్వోగాలను నియంత్రించుకోవడం, పరిపూర్ణ వ్యక్తులుగా ఎదగడం లాంటి ప్రయోజనాలు కలిగిన ఆటలను ఆడడానికి పిల్లలను ప్రోత్సహిద్దాం, వయస్సును మరిచి పిల్లలుగా మారుతూ వారితో కలిసి ఆటలు ఆడదాం. ఆటలు ఆనందాన్ని పంచే దివ్య సాధనాలని, అమూల్యమైన సంతోషాలను బహుకరించే వేదికలు ఆటలు మాత్రమే అని తెలుసుకుందాం, పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఆటలతో పునాదులు వేద్దాం.
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037