🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 09 Jun, 2026 | Page: 1

కుమ్మర (శాలివాహన) వృత్తి దారుల ఆరోగ్య భద్రత కొరకు ప్రత్యేక ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి.

తెలంగాణ రాష్ట్రములో దాదాపు 5లక్షల జనాభా కలిగిన కుమ్మర్లు

రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల్లో అత్యంత వెనుకబడినవారు. సంప్రదాయ వృత్తిని నమ్ముకొన్న కష్టజీవులు. మట్టిని నమ్ముకొని కుమ్మర వృత్తిపై జీవిస్తున్న వృత్తిదారుల జీవన భద్రతకు సంబంధించిన ప్రమాద బీమా పథకాన్నీ ప్రభుత్వం అమలుచేయాలి.

కుమ్మర వృత్తి _ ప్రజారోగ్యం పర్యావరణ పరిరక్షణ
సమాజంలో ప్రజారోగ్యానికి దోహధపడే మట్టి పాత్రలు కుండలు తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు.
మట్టి పాత్రలను ఉత్పత్తి చేస్తూ భారత దేశ నాగరికత వారసత్వాన్నిరక్షిస్తున్నారు.హిందూ పండుగల్లో బోనాలు పూజకు
కావలసిన ప్రతిమలు తయారు చేస్తూ దేశసంస్కృతిని కాపాడుతున్న కుమ్మర వృత్తి కార్మికులు అనేక రకాల ప్రాణ పాయ ఆరోగ్య ప్రమాదాల అంచున జీవిస్తున్నారు. శారీరక శ్రమతో కూడిన కుమ్మర వృత్తిలో పనిచేస్తున్న కుమ్మర వృతి కార్మికులు అనేక ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు.

మట్టి తవ్వకాలలో ముప్పు
కుండల మట్టి పాత్రల తయారీకి అవసరమైన ప్రత్యేకమైన మట్టి కోసం చెరువులు గుట్టల వద్ద లోతైన తవ్వకాలు జరిపేటపుడు
అకస్మాత్తుగా మట్టి దిబ్బలు కూలి కార్మికులు సజీవ సమాధి అవుతున్న సంఘటనలు జరుగుతున్నాయి.

బట్టీలు (ఆవాలు/ వాము)వద్ద ప్రమాదాలు
మట్టి పాత్రలను అధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చే ప్రక్రియలో భాగంగా అగ్ని ప్రమాదాలు జరిగి ఒళ్ళు కాలిపోయిన సంఘటనలు జరగడం శోచనీయం.
రవాణా నష్టాలు కుమ్మర వృత్తిదారులు కస్టపడి
తయారు చేసిన మట్టి పాత్రలను మార్కెట్లకు (సంతలకు) తరలించే క్రమంలో జరిగే రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు.అనేక కుమ్మర వృత్తిదారుల కుటుంబాలు సభ్యులను కోల్పోయి రోడ్డున పడుతున్నారు .
ఆరోగ్య నష్టాలు మరియువైకల్యం
ఆక్యుపేషనల్ హెల్త్ సర్వే ప్రకారం
కుమ్మర వృత్తి కార్మికులు నిరంతరం వంగి శ్రమించడం వల్ల దాదాపు 80 శాతంపైగా కుమ్మర కార్మికులు తీవ్రమైన వెన్నుపాము కీళ్ల వ్యాధులతో బాధప డుతున్నారని తేలింది.
ఇందులో 24.5% మందికి పైగా వయసు పై బడక ముందే నడుము కింది భాగం పక్షవాతం లేదా శాశ్వత వైకల్యానికి గురై పనిచేయలేని స్థితికి చేరుకుంటున్నారు.
బట్టీల పొగ మట్టిలోని సిలికా కణాల స్వాసించడం వల్ల 30 శాతం మంది ఉబ్బసం సిలికోస్ వంటి దీర్ఘకాలిక శ్వాస కోశ వ్యాధుల బారిన పడుతున్నారు.

ఆర్థిక భద్రత ప్రపంచీకరణ కార్పోటీకరణ ప్రభావం వల్ల మార్కెట్లో ప్లాస్టిక్ వస్తువుల అమ్మకం పెరిగింది. ప్లాస్టిక్ అల్యూమినియం పాత్రల వల్ల మట్టి పాత్రలు ఉత్పత్తులు
పోటీ ఎదుర్కొంటున్నాయి. కుమ్మర్ల ఉత్పత్తులకు డిమాండ్ తగ్గింది.ఆదాయం తగ్గింది. వృత్తిని వదిలి పట్టణాలకు వలస పోతున్నారు. కుటుంబంలో సంపాదించే ఏకైక వ్యక్తి ప్రమాదానికి గురైతే ప్రైవేటు వైద్య ఖర్చులు భరించలేని కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. అప్పులు తీర్చక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
కుమ్మర వృత్తిని ప్రమాద వృత్తిగా గుర్తించాలి
ఇప్పటికే ప్రభుత్వం గీత కార్మికులకు మత్స్య కార్మికులకు చేనేత కార్మికులు అందిస్తున్న తరహాలోనే ప్రమాద తీవ్రత గల కుమ్మర వృత్తిని గూడ గుర్తించి ప్రమాద భీమా సౌకర్యం
కల్పించాలి .
ప్రత్యేక ప్రమాథ బీమా పథకం
బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కుమ్మర కార్పొరేషన్ (శాలివాహన) ద్వారా ప్రతి గుర్తింపు పొందిన కుమ్మర వృతి వృత్తిదారునికి 5 లక్షల రూపాయలు ఉచిత ప్రమాద బీమా కల్పించాలి.

వైఖల్య పరిహారం కుమ్మర వృత్తిదారులకు ప్రమాదవశాత్తు పాక్షిక లేదా శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ"2'50'000 ఆర్థిక సాయం అందించాలి .ఉచిత వైద్య సౌకర్యం వృత్తిపరమైన శ్వాసకోశ కీళ్ల వ్యాధులతో బాధపడే కార్మికులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత కార్పొరేట్ వైద్యం సేవలు అందించాలి ప్రత్యేక హెల్త్ కార్డులు జారీ చేయాలి.
కుమ్మర వృత్తి దారులకు
లేబర్ కార్డ్స్ ఇవ్వాలి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక మంత్రిత్వ శాఖ కుమ్మర వృత్తిదారు లను కార్మికులుగా గుర్తించి ప్రమాద బీమా ఆరోగ్యబీమా పథకాలు వర్తింప చేయాలి.
కుమ్మర బీమా పథకం
ప్రవేశ పెట్టాలి
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు రైతు భీమా ఉన్నట్లే కుమ్మర వృత్తిపై ఆదారపడిన కుమ్మర/ కుటుంబాలకు శాలివాహన/ కుమ్మర బీమా పథకాన్ని వర్తింపజేసి ఆదుకోవాలి.
ఇఎస్ఐ' ఉచిత ఆరోగ్య బీమా
ప్రమాద బీమా పథకాలు వర్తింప చేయాలి.

ఆర్థికన్యాయం సాంఘిక న్యాయం కల్పించాలి
కుమ్మర వృత్తి దారులకు
వృత్తిపరమైన ఆరోగ్య సమస్యల నుండి రక్షించి కుమ్మర వృత్తిదారులకు ఆర్థిక న్యాయం సాంఘిక న్యాయం కల్పించాలి .

నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ కుమ్మర సంఘం 880/2014
తెలంగాణ రాష్ట్రం
హైదరాబాద్
9440245771
🏠 Home