🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 09 Jun, 2026 | Page: 1

కాంగోలో 100 దాటిన ఎబోలా మృతుల సంఖ్య

బునియా: డెమోక్ర‌టిక్ రిప‌బ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారిన సంఖ్య 101కి చేరుకున్న‌ది. ఆ దేశంలోని ఇటురి ప్రావిన్సులో ఎబోలా వైర‌స్ వేగంగా విస్త‌రిస్తోంది. అయితే అక్క‌డ ఉన్న సాయుధ గ్రూపుల వ‌ల్ల వైర‌స్ నియంత్ర‌ణ క‌ష్ట‌సాధ్యంగా మారుతోంది. తాజాగా ప్ర‌భుత్వం కొత్త నివేదిక‌ను రిలీజ్ చేసింది. 550 పాజిటివ్ కేసుల్లో మృతుల సంఖ్య వంద‌కు చేరిన‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కొత్త‌గా 10 మంది మృతిచెంద‌గా, 35 కొత్త కేసులు న‌మోదు అయిన‌ట్లు ప్ర‌భుత్వం చెప్పింది. ఎబోలాలోని బుందిబుగ్యో స్ట్రెయిన్ మ‌హ‌మ్మారిలా మారిన‌ట్లు మే 15వ తేదీన ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.
🏠 Home