విద్వేష ఫ్యాక్టరీ.. యూఎన్‌లో పాక్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇండియా
న్యూఢిల్లీ: పాకిస్థాన్ తమ దేశంలో ఉన్న మిలిటెంట్ల గ్రూపునకు ఫిత్నా అల్ హిందుస్తాన్ అని పేరు పెట్టింది. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సరిహద్దు పోరులో ఆ సంస్థ విధ్వంసానికి పాల్గొన్నట్లు పాక్ పేర్కొన్నది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా పాకిస్థాన్ ఆ ఆరోపణలు చేసింది. దానికి భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. పాకిస్థాన్ ప్రభుత్వం ఆ ఉగ్రవాద గ్రూపును నిర్వహిస్తున్నట్లు భారత ప్రతినిధి యూఎన్‌లో పేర్కొన్నారు. యూఎన్ భద్రతా మండలిలో ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిపై జరుగుతున్న చర్చ సమయంలో పాక్ వైఖరిని భారత్ తీవ్రంగా ఖండించింది