🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 09 Jun, 2026 | Page: 1

పెద్ది’పై అల్లు అర్జున్ ప్రశంసల జల్లు.. రామ్ చరణ్ నటనకు ఫిదా, బుచ్చిబాబుకు ప్రత్యేక అభినందనలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్న వేళ, ఈ సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సినిమా చూసిన అనంతరం సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్న అల్లు అర్జున్, రామ్ చరణ్ నటనతో పాటు చిత్ర బృందం పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు.‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించిన అల్లు అర్జున్, “నిన్న రాత్రి ‘పెద్ది’ సినిమా చూశాను. రామ్ చరణ్ అద్భుతమైన నటన కనబరిచాడు. ముఖ్యంగా ఆయన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అసాధారణంగా ఉంది. పాత్రలో పూర్తిగా లీనమై రా అండ్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఎంతో గ్రేస్‌ఫుల్‌గా ఉన్నాయి. ప్రతి అంశంలోనూ చరణ్ తన ప్రతిభను నిరూపించాడు. అతడిని చూస్తే నిజంగా గర్వంగా అనిపించింది. ఈ ప్రశంసలకు పూర్తిగా అర్హుడు” అంటూ కొనియాడారు.
🏠 Home