🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 06 Jun, 2026 | Page: 1

పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చూస్తూ బ్రెయిన్ సర్జరీ.. గుంటూరులో అరుదైన వైద్యం

వైద్య రంగంలో సాంకేతికత రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా మెదడుకు సంబంధించిన క్లిష్టమైన శస్త్రచికిత్సల్లో వైద్యులు అనుసరిస్తున్న వినూత్న విధానాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. రోగి పూర్తిగా స్పృహలో ఉండగానే మెదడుకు ఆపరేషన్ చేసే ‘అవేక్ బ్రెయిన్ సర్జరీ’ విధానం ఇప్పుడు మరింత విస్తృతంగా అమలవుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఇలాంటి ఓ అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన గనిపిశెట్టి రాఘవులు, కోటేశ్వరమ్మ దంపతులు ప్రస్తుతం గుంటూరు జిల్లా పొన్నూరులో కిచిడీ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా కోటేశ్వరమ్మ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆమె ఒక్కసారిగా మూర్ఛపోయి కిందపడటంతో కుటుంబ సభ్యులు వెంటనే వడ్లమూడిలోని ఆసుపత్రికి తరలించా
🏠 Home