🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 19 Oct, 2026 | Page: 1

కొండమల్లేపల్లిలో బతుకమ్మ ఉత్సవాలు: నిత్యం ప్రథమ బహుమతే లక్ష్యంగా... గత 14 ఏళ్లుగా అగ్రస్థానంలో పసునూరి రమాదేవి

దేవరకొండ,19అక్టోబర్ (BVK 3 న్యూస్ ) :
దసరా పండగ వచ్చిందంటే నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎంగిలిపువ్వు బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో బతుకమ్మ ఉత్సవం ముగుస్తుంది .ఈ బతుకమ్మ ఉత్సవాలలో మహిళలు చాలామంది బతుకమ్మను రకరకాల పూలతో అందంగా పేర్చి పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అందంగా ముస్తాబై మూకుమ్మడిగా బతుకమ్మ వేడుకను నిర్వహిస్తుంటారు. ప్రతి మహిళ బతుకమ్మ వేడుకలలో పాల్గొనాలనే సంతోషం ,ప్రేమ, అభిమానం కనబరుస్తుంది. ఈ తరుణంలో కొండమల్లేపల్లి పట్టణానికి చెందిన పసునూరు రమాదేవి అనే మహిళ బతకమ్మ పై ఉన్న ప్రేమను గత 14 సంవత్సరాలుగా తెలియజేస్తూ వస్తుంది.బతుకమ్మ అంటే నాకు ప్రాణం అని మనస్ఫూర్తిగా అమ్మవారి మీద ప్రేమతో ప్రతి సంవత్సరం బతుకమ్మను తయారు చేస్తానని పట్టణానికి చెందిన పసునూరి రమాదేవి అన్నారు. ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలలో భాగంగా నిర్వహించే ఎంగిలి పువ్వు, సద్దుల బతుకమ్మలో గత 14 సంవత్సరాలుగా ఆమె మొదటి బహుమతి పొందుతున్నారు. సాధారణంగా మహిళలకు తెలంగాణలో దసరా పండగ వచ్చిందంటే బతుకమ్మ సందడి మొదలవుతుంది. కొండమల్లేపల్లి పట్టణానికి చెందిన పసునూరు మాధవాచారి భార్య పసునూరు రమాదేవి గత 14 సంవత్సరాలుగా బతుకమ్మ ప్రదర్శనలో మొదటి బహుమతి పొందడం ప్రత్యేకంగా నిలిచింది .గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో దేవరకొండ పట్టణంలో నిర్వహించిన ఉమ్మడి దేవరకొండ మండలంలో కూడా తాను మొదటి బహుమతి గెలిచింది. నాటి నుండి నేటి వరకు గత 14 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రమాదేవి మొదటి బహుమతి పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆమెను శ్రీ సీతారామచంద్రమౌళీశ్వర ఆంజనేయ స్వామి అయ్యప్ప సహిత దేవాలయ కమిటీ సభ్యులు బహుమతులను అందజేసి అభినందించి సన్మానం చేస్తున్నారు. దసరా ఉత్సవంలో కొండమల్లేపల్లి సర్పంచ్ పసునూరి యుగేందర్ రెడ్డి చేతులమీదుగా ఆమెకు బహుమతిని అందజేసి సన్మానం చేశారు .ఈ సందర్భంగా పసునూరి రమాదేవి కొండమల్లేపల్లి మండలంలో బతుకమ్మలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పూలను సేకరించడంలో ఇబ్బంది ఉన్నా మనసు నిండా అమ్మవారి ప్రేమ ఉండడంతో కష్టమైనా ఇష్టంగా పూలను సేకరించి అందరిలో ప్రత్యేకంగా తయారు చేయడం ఆమె ప్రత్యేకత. నేను ఎప్పుడు కూడా బహుమతి కోసం బతుకమ్మను తయారు చేయలేదని అమ్మవారి మీద ఉన్న ప్రేమతో అభిమానంతో ఆడపడుచు గా బతుకమ్మ ఆడాలనే కుతూహలంతో మనస్ఫూర్తిగా నేను బతుకమ్మను తయారు చేస్తాను .వరుసగా నాకు మొదటి బహుమతి రావడం సంతోషంగా ఉంది అని పసునూరు రమాదేవి తమ ఆనందాన్ని తెలుగు ప్రభకు తెలిపారు
🏠 Home