🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 19 Oct, 2026 | Page: 1

స్ధానిక ఎన్నికల వేళ టీడీపీకి బిగ్ షాక్..!

ఏపీలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా.. ఇవాళ పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికార కూటమి ఏ చిన్న అవకాశం కూడా వదులుకోకుండా విపక్ష వైసీపీ నుంచి చిన్న చిన్న నాయకులను సైతం తమ పార్టీవైపు తిప్పుకుంటోంది. వారికి అభ్యర్ధిత్వాలు, పదవుల ఆశ చూపిస్తోంది. ఇలాంటి సమయంలో కూటమిని నడుపుతున్న టీడీపీకి ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణఝలక్ ఇచ్చారు.తన సొంత జిల్లా విజయనగరంలోని గజపతి నగరం నియోజకవర్గంలో ఉన్న బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామం, పరిసర ప్రాంతాల్లో టీడీపీ క్యాడర్ కు బొత్స వల విసిరారు. క్షేత్రస్దాయిలో వ్యూహాలతో సంప్రదింపులు జరిపి ఏకంగా 150 కుటుంబాల్ని ఇవాళ పార్టీలోకి తీసుకొచ్చారు. దీంతో ఈ ప్రాంతంలో వైఎస్సార్సీపీకి ఎన్నికల వేళ ఊపు వచ్చినట్లయింది. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, బొడ్డు రాము ఈ 150 కుటుంబాల్ని టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు. దీంతో ఇవాళ బొత్స సత్యనారాయణ, జిల్లా వైసీపీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ , మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు.



🏠 Home