🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 17 Oct, 2026 | Page: 1

ఒకే ఇంట్లో ఐదు మృతదేహాలు!

గ్రేటర్ నోయిడాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నోయిడాలోని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రబుపురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనలో తల్లిదండ్రులతో పాటు వారి ముగ్గురి పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబంలో ఐదుగురు ఒకేసారి మరణించడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు, తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫుడ్ పాయిజనింగ్ లేదా ఏదైనా విషపదార్థం శరీరంలోకి అధిక మోతాదులో వెళ్లడం వల్లే ఈ మరణాలు సంభవించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతి చెందిన ఐదుగురు చివరిగా టీ తాగి, మ్యాగీ తిన్నట్లు తెలిసింది. అయితే కేవలం వారు తిన్న ఆహారం వల్లే ఈ దుర్ఘటన జరిగిందా లేదా దీని వెనుక మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
🏠 Home