🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 17 Oct, 2026 | Page: 1

పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!

సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్యా మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహం చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఎట్ట‌కేల‌కు చెక్ ప‌డింది. తాజాగా వీరిద్ద‌రూ ఒక‌టి కాబోతున్న‌ట్లు కావ్య తండ్రి క‌ళానిధి మార‌న్ తెలిపాడు. పెళ్లి వేడుక యూర‌ప్‌లో జ‌రుగ‌బోతుండ‌గా.. నవంబర్ 21న చెన్నైలో వీరి వివాహ రిసెప్షన్ అత్యంత వైభవంగా జరగనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికల అందజేత కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది.ఇందులో భాగంగా సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్, ఆయన సతీమణి కావేరి మారన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఈ ఆహ్వానానికి సంబంధించిన వివరాలను అధికారికంగా ధృవీకరించడంతో ఈ వార్త రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
🏠 Home