🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 13 Oct, 2026 | Page: 1

సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు..

సినీ పరిశ్రమలో గ్లామర్, పేరు ప్రఖ్యాతులు ఎంతగా కనిపిస్తాయో.. వాటి వెనుక కొందరు ఎదుర్కొనే చేదు అనుభవాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే నటీనటులకు అవకాశాల పేరుతో అనుచిత ప్రతిపాదనలు ఎదురవుతున్నాయనే ఆరోపణలు తరచూ తెరపైకి వస్తుంటాయి. గతంలో ‘మీటూ’ ఉద్యమం ద్వారా పలువురు తమ అనుభవాలను వెల్లడించగా.. తాజాగా నటి నీతి టేలర్ తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఓ చేదు సంఘటనను గుర్తుచేసుకున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెండో సినిమా అవకాశం కోసం తనను ఓ దర్శకుడు అసభ్యకరమైన షరతు విధించాడని ఆమె వెల్లడించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.టెలివిజన్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నీతి టేలర్.. దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు. అయితే, సౌత్ ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె కీలక విషయాలు వెల్లడించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తాను కేవలం రెండు సినిమాల్లో మాత్రమే భాగమయ్యానని ఆమె తెలిపింది. తన మొదటి సినిమా పూర్తయిన తర్వాత మరో ప్రాజెక్ట్ కోసం ఓ దర్శకుడు తనను సంప్రదించాడని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, రెండో సినిమాలో అవకాశం ఇవ్వాలంటే తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ ఆ దర్శకుడు అసభ్యకరమైన ప్రతిపాదన చేసినట్లు నీతి టేలర్ వెల్లడించారు. సినిమాల్లో అవకాశాలు కల్పించాల్సిన వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు ఎదురవడంతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఆమె చెప్పినట్లు కథనం పేర్కొంది. తన ప్రతిభ ఆధారంగా అవకాశాలు వస్తాయని ఆశించిన సమయంలో ఇలాంటి పరిస్థితి ఎదురవడం బాధ కలిగించిందని ఆమె వివరించింది.
🏠 Home