🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 10 Oct, 2026 | Page: 1

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు దేవరకొండ క్రీడాకారిణి వి.పూజ ఎంపిక

హాలియాలో ఉమ్మడి జిల్లా స్థాయి విజయం
- డిసెంబర్ 11, 12, 13 తేదీల్లో సంగారెడ్డిలో పోటీలు
దేవరకొండ,10అక్టోబర్ (BVK 3 న్యూస్ ) :
నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన క్రీడాకారిణి వి. పూజ అండర్-19 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల హాలియాలో నిర్వహించిన ఉమ్మడి ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో ప్రతిభ కనబరిచిన ఆమె, రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు.
​సంగారెడ్డి వేదికగా డిసెంబర్ 11, 12, 13 తేదీలలో జరగనున్న ఈ రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్‌లో పూజ ఉమ్మడి జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
​దేవరకొండలోని మదర్ తెరిసా స్పోర్ట్స్ క్లబ్‌లో నిత్యం కష్టపడుతూ, కోచ్ రాంచందర్ పర్యవేక్షణలో ఆమె కఠిన శిక్షణ పొందుతున్నారు. క్రీడాకారిణిని రాష్ట్ర స్థాయికి చేర్చడంలో కోచ్ రాంచందర్ అందిస్తున్న కృషితో పాటు, క్రీడాకారులకు ఆర్థికంగా ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తున్న కళ్యాణ్ నాయక్ గారికి మదర్ తెరిసా స్పోర్ట్స్ క్లబ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పూజ రాష్ట్రస్థాయి పోటీలలోనూ సత్తా చాటి జిల్లాకు పేరు తెవాలని స్థానికులు, క్రీడాకారులు అభినందనలు తెలిపారు.
🏠 Home