🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 10 Oct, 2026 | Page: 1

ఎస్పీ అదేశాలతో పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు

- మల్లంపల్లిలో ముమ్మర వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు
- నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
- డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించిన ఎస్సై చంద్ర శేఖర్.
ములుగు జిల్లా ప్రతినిధి,
అక్టోబర్ 09 (బీవీకే న్యూస్):
ములుగు జిల్లా మల్లంపల్లి మండలం శ్రీనగర్ క్రాస్ వద్ద జాతీయ రహదారిపై ఎస్సై చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు.జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకేన్ ఆదేశాలతో ఇసుక లారీల అతివేగం,డ్రైవర్ల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా ముమ్మర తనిఖీలు చేపట్టామని ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. మల్లంపల్లి శ్రీనగర్ ప్రధాన రహదారిపై వెళ్తున్న ఇసుక లారీలను ఆపి తనిఖీ చేశారు.స్పీడ్ లిమిట్ దాటి వెళ్తున్న లారీలను గుర్తించి కేసులు నమోదు చేయడంతోపాటు,కొంత మంది లారీ డ్రైవర్లు మద్యం సేవించి,అతివేగం తో వాహనాలునడుపుతూ ప్రజల ప్రాణాలకు ఆటంకం కలిగేలా ప్రవర్తిస్తున్న తీర్పు అడ్డుకట్ట వేసే ఉద్దేశంలో భాగంలోనే వాహన తనిఖీలు చేపట్టామని తెలిపారు.రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ఇసుక లారీల అతివేగమేనని,ఇకపై స్పీడ్ లిమిట్ దాటితే లారీలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.లారీలకు తప్పనిసరిగా స్పీడ్ లాక్ ఉండాలని,డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపద్దని హెచ్చరించారు.నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రతిరోజు తనిఖీలు కొనసాగుతాయని,ప్రజల భద్రతే తమ లక్ష్యమని ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.
🏠 Home