దేవరకొండలో ఘనంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
దేవరకొండ,09అక్టోబర్ (BVK 3 న్యూస్ ) :
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) దేవరకొండ శాఖ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులతో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ కళాశాలల విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని, బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించేలా కార్యక్రమం సాగింది.
ఈ సందర్భంగా ABVP రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ యలమల గోపీచంద్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానానికి, సంస్కృతి సంప్రదాయాలకు, ప్రకృతితో మనకున్న అనుబంధానికి ప్రతీక అని అన్నారు. తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగకు రాష్ట్రంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉందని పేర్కొన్నారు. వివిధ రకాల పూలను సేకరించి బతుకమ్మలను పేర్చడం, వాటి చుట్టూ చేరి పాటలు పాడుతూ ఆటలతో సంబరాలు జరుపుకోవడం మన సంప్రదాయంలోని ప్రత్యేకత అని తెలిపారు.
బతుకమ్మ పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, ప్రకృతిని ఆరాధించడం, పూల ప్రాముఖ్యతను గుర్తించడం, సమాజంలో ఐక్యతను పెంపొందించడం వంటి గొప్ప సందేశాలను అందిస్తుందని అన్నారు. తరతరాలుగా వస్తున్న మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు విద్యతో పాటు మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించుకోవాలని, మన పండుగల వెనుక ఉన్న సామాజిక, సాంస్కృతిక విలువలను తెలుసుకోవాలని సూచించారు.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థులలో విద్యా సంబంధిత అంశాలతో పాటు సామాజిక బాధ్యత, జాతీయ భావాలు, సాంస్కృతిక విలువలను పెంపొందించేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. కళాశాలల్లో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, పరస్పర సహకారం, ఐక్యతాభావం పెరుగుతాయని అన్నారు. తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ, మన సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వివేకానంద ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గణేష్ , నగర సహకార్యవాహ కటకం ప్రవీణ్ జి, ఏబీవీపీ నగర గర్ల్స్ కన్వీనర్ శ్రావణి, కావ్య, శిరీష, నగర జాయింట్ సెక్రెటరీ యలమల హేమ సుందర్, గుండాల శివరామరాజు, యలమల హేమేందర్ , ఎండి సర్ఫరాజ్, ఎండి అబ్దుల్లా , విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేశారు