🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 09 Oct, 2026 | Page: 1

గతంలో కంటే డేంజరస్‌గా కోహ్లీ ఫామ్

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ వయసు పెరుగుతున్నా.. అతడి ఆటలో మాత్రం జోరు తగ్గడం లేదు. కెరీర్‌ చివరి దశలోనూ వన్డేల్లో పరుగుల వరద పారిస్తూ ప్రత్యర్థి బౌలర్లకు సవాల్‌ విసురుతున్నాడు. 37 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్న కోహ్లీ.. తన కెరీర్‌లోనే అత్యుత్తమ దశలో ఉన్నాడా? అంటే దక్షిణాఫ్రికా దిగ్గజం, కోహ్లీ మాజీ ఆర్సీబీ సహచరుడు ఏబీ డివిలియర్స్‌ మాత్రం అవుననే అంటున్నాడు. 2016-17లో కనిపించిన కోహ్లీ కంటే ఇప్పుడు మరింత మెరుగైన ఆటగాడిగా మారాడని అభిప్రాయపడ్డాడు.‘2016తో పోలిస్తే ఇప్పుడు కోహ్లీ మరింత మెరుగైన ఆటగాడని నేను భావిస్తున్నా. మైదానంలో అతడు ఎంత ప్రశాంతంగా ఉంటున్నాడో గమనించవచ్చు. పూర్తి స్వేచ్ఛగా ఆడుతున్నట్లు కనిపిస్తున్నాడు. గతంలో కంటే మరింత డేంజరేస్‌గా ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నాడు. ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో అతడి ఆటతీరులో మార్పు కనిపించింది. మొదట కొత్త తరహాలో ఆడేందుకు ప్రయత్నించినా.. ఆ తర్వాత దూకుడుగా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. తన సహజమైన ఆటను ఆస్వాదించడం మొదలుపెట్టాడు’ అని ఏబీడీ అభిప్రాయపడ్డాడు.
ఇంకెంతకాలం ఆడతాడో తెలియదు!
37 ఏళ్ల వయసులోనూ కోహ్లీ ఇంతటి స్థాయిలో రాణించడానికి అతడి మానసిక స్థితి కూడా కారణమని డివిలియర్స్‌ పేర్కొన్నాడు. ‘ప్రస్తుతం తన ప్రతిభను బయటపెట్టడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు తన ఆటను ఆస్వాదించేలా చేయడమే తన చేతుల్లో ఉందని కోహ్లీ గుర్తించాడు. అది మరో రెండేళ్లు, మూడేళ్లు లేదా ఐదేళ్లు కావొచ్చు. అతడు ఇంకెంతకాలం ఆడతాడో నాకు తెలియదు. కానీ కోహ్లీ ఆటలో ఈ కోణాన్ని చూడటం నాకు ఎంతో ఆనందంగా ఉంది.
🏠 Home