🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 08 Oct, 2026 | Page: 1

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం చంద్రబాబు భేటీ..

రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు(గురువారం) కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలపై చర్చించారు. దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన వివిధ అంశాలపై చర్చ జరిగింది. గోదావరి-కావేరి నదుల అనుసంధానం గురించి దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించామని.. దీన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.
🏠 Home