🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 05 Oct, 2026 | Page: 1

లైబ్రరీ, ఫైర్‌స్టేషన్ల ఏర్పాటుకై ఆమరణ నిరాహార దీక్ష

లక్షెట్టిపేట పట్టణాభివృద్ధి, దీర్ఘకాలిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం బొప్పు సతీష్ సోమవారం గాంధీచౌక్‌లో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పట్టణంలో యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని లైబ్రరీ భవనాన్ని, ప్రమాదాల నివారణకు ఫైర్‌స్టేషన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పలుమార్లు వినతులు ఇచ్చినా ఫలితం శూన్యం
ఈ సందర్భంగా బొప్పు సతీష్ మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు శాశ్వత లైబ్రరీ లేక ఇబ్బందులు పడుతున్నారని, అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఆస్తులు, ప్రాణ నష్టాన్ని నివారించే ఫైర్‌స్టేషన్ లేకపోవడం దారుణమన్నారు. గత కొన్నేళ్లుగా మంచిర్యాల జిల్లా కలెక్టరేట్, లక్షెట్టిపేట తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి ద్వారా ఎన్నో వినతిపత్రాలు ఇచ్చినా అధికారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసుల హెచ్చరిక.. ప్రజాసంఘాల మద్దతు
పట్టణ పురోగతి కోసం సతీష్ చేపట్టిన ఈ ఆమరణ దీక్షకు స్థానికులు, పలు ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు గాంధీచౌక్ వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమరణ దీక్షను విరమించి, రిలే నిరాహార దీక్షగా మార్చుకోవాలని ఆయనకు సూచించారు.
🏠 Home