🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 03 Oct, 2026 | Page: 1

హుటాహుటిన పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచిన నయారా

దేశవ్యాప్తంగా నయారా ఎనర్జీకి దాదాపు 7,108 పెట్రోల్ బంకులు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా వ్యవస్థలో అస్థిరత ఏర్పడటం, పెరిగిన ఉత్పత్తి వ్యయాలను తట్టుకోవడానికి నయారా ఈ ధరలను సవరించాల్సి వచ్చింది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ వ్యాప్తంగా చమురు మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తోన్న విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం నయారా సంస్థకు ఇది కొత్తేమీ కాదు. Also Read డిసెంబర్ లో విశాఖ నక్షత్రంలో శుక్రసంచారం.. ఈ ఐదు రాశుల పంట పండుతుంది! ఈ ఏడాది మార్చిలో ఇరాన్ సంక్షోభం తలెత్తిన సమయంలో కూడా వీటి రేట్లను పెంచింది. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరల భారాన్ని వినియోగదారులపై బదిలీ చేసిన మొదటి సంస్థ నయారా ఎనర్జీనే కావడం గమనార్హం. ఆ సమయంలో కూడా పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంచడంతో వాటి ధరలు ఆయా బంకుల్లో వరుసగా రూ.100.71, రూ.91.31 కి చేరాయి. ఆ తర్వాత జూలై 1 నాటికి పశ్చిమాసియాలో పరిస్థితులు సద్దుమణగడంతో కంపెనీ పెంచిన ధరలను ఉపసంహరించుకుంది. లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గించింది. ఇప్పుడు మళ్లీ పెరుగుదల బాట పట్టింది. ప్రభుత్వ రంగ చమురు విక్రయ సంస్థలతో పోలిస్తే ప్రైవేట్ రిటైలర్లు మార్కెట్ ఒడిదొడుకులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తుంటారు. ఈ ఏడాది మే లో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా దశలవారీగా ఇంధన ధరలను పెంచాయి. లీటర్ కు దాదాపు రూ. 7.50 వరకు అదనపు భారాన్ని వాహనదారులపై మోపాయి. ప్రైవేట్ రంగంలో ఉండే నయారా ఎనర్జీ ఎప్పటికప్పుడు గ్లోబల్ రేట్లను బట్టి ధరలను సవరిస్తోంది.

🏠 Home