దేవరకొండ మండలంలో ఘనంగా పోషణ మాసోత్సవాలు
సమతుల ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం: సర్పంచ్ చాట్ల రమాదేవి రాములు
తెలుగుపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో ఉత్సాహంగా పోషణ మాసం వేడుకలు
దేవరకొండ,03అక్టోబర్ (BVK 3 న్యూస్ ) :
దేవరకొండ మండలంలోని తెలుగుపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసంలో భాగంగా శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్ చాట్ల రమాదేవి రాములు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సమతుల ఆహారం తీసుకోవాలని, అంగన్‌వాడీ కేంద్రంలో అందించే ఆరోగ్య లక్ష్మి భోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామాల్లో లభించే ఆకుకూరలు, కూరగాయలు, కరివేపాకు, మునగాకు వంటివి తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం సొంతం అవుతుందని తెలిపారు.
అనంతరం సూపర్‌వైజర్ విజయలక్ష్మి మాట్లాడుతూ... శిశు పోషణ, తల్లిపాల్లి ప్రాముఖ్యత, ఆరోగ్యం, శుభ్రత మరియు పారిశుద్ధ్యం వంటి ముఖ్యాంశాలపై అవగాహన కల్పించారు. అంగన్‌వాడీ టీచర్లు గృహ సందర్శన ద్వారా తల్లులకు తగు సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి అంగన్‌వాడీ టీచర్ సునీత, ఆయమ్మ యాదమ్మ, ఏఎన్‌ఎం శోభారాణి, వాణి, ఆశా వర్కర్ జ్యోతి, గ్రామ పెద్దలు మరియు తల్లులు తదితరులు పాల్గొన్నారు.