🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 03 Oct, 2026 | Page: 1

సుప్రీంకోర్టుకే ఉచిత సలహాలు..

విచారణ గడువు పెంపు కోసం లేఖ.. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ (బారాసత్) మూడో కోర్టుకు చెందిన అదనపు జిల్లా , సెషన్స్ జడ్జి ఈ వింత పరిస్థితికి కారణమయ్యారు. గత ఐదేళ్లుగా జైలులోనే విచారణ ఎదుర్కొంటున్న ఒక నిందితుడి బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు గత మే 11న తిరస్కరించింది. కేసు విచారణ చాలా నెమ్మదిగా సాగుతుండటంతో, రాబోయే మూడు నెలల్లోనే విచారణను పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. అయితే, నిర్దేశిత సమయంలో విచారణ పూర్తి కాకపోవడంతో, మరికొంత సమయం కావాలంటూ అగష్టు 11న సదరు జడ్జి సుప్రీంకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. ఆ లేఖ వరకు బాగానే ఉన్నా, అందులోని చివరి రెండు పేరాల్లో బెయిల్ సూత్రాలపై సుప్రీంకోర్టుకే సలహాలు ఇస్తూ రాయడమే వివాదానికి మూలమైంది. Also Read షాకింగ్ ..! ఈసీ, సీఈసీ కుమార్తె కేసుల్లో సుప్రీం జడ్జి తీర్పులు- ఈసీ లాయర్ గా కొడుకు..! మండిపడిన జస్టిస్ పార్డీవాలా బెంచ్ జస్టిస్ జె.బి. పార్డీవాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుటకు ఈ లేఖ వచ్చింది. లేఖలోని అంశాలను చదివిన ధర్మాసనం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కేసు విచారణకు అదనపు సమయం కోరుతూ ఒక జడ్జి లేఖ రాసిన తీరు తమను ఎంతగానో కలచివేసిందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ కోర్టు ఎప్పుడు బెయిల్ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వకూడదనే విషయంలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ సలహాలు ఇవ్వడం ఏమాత్రం తగదని స్పష్టం చేశారు. లేఖలోని చివరి రెండు పేరాల్లో రాసిన వ్యాఖ్యలు అసందర్భంగా, ఆమోదయోగ్యం కాని రీతిలో ఉన్నాయని వ్యాఖ్యానించారు.

🏠 Home