🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 03 Oct, 2026 | Page: 1

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్‌

ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ ఫైన‌ల్‌లో భార‌త్, పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య ప‌సిడిపోరు జ‌రుగుతున్న‌ది. టాస్ (Toss) గెలిచిన భార‌త్ బ్యాటింగ్ ఎంచుకున్న‌ది. దాయాది పాకిస్థాన్‌ను ఫీల్డింగ్‌కు ఆహ్వానించింది. చిర‌కాల ప్ర‌త్య‌ర్థుల మ‌ధ్య పోరు కావ‌డంతో ఈ మ్యాచ్‌పై స‌ర్వత్రా ఉత్కంఠ నెల‌కొన్న‌ది. అయితే మ్యాచ్‌కు వ‌ర్షం అడ్డంకిగా మారే అవ‌కాశం ఉంద‌ని జ‌పాన్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించ‌డంతో పూర్తి మ్యాచ్ కొన‌సాగుతుందా లేదంటే ర‌ద్ద‌వుతుందా..? అనేది అనుమానంగా ఉన్న‌ది.జపాన్‌లోని నిశిన్ వేదికగా కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. భారత జట్టుకు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా,
పాకిస్తాన్ జట్టుకు సాహిబ్జాదా ఫర్హాన్ నాయకత్వం వహిస్తున్నారు.
తుది జ‌ట్లు ఇవే..
భారత్ (IND) : అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
పాకిస్తాన్ (PAK) : సాహిబ్జాదా ఫర్హాన్ (కెప్టెన్), అయూబ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), హైదర్ అలీ, హసన్ నవాజ్, అబ్దుల్ సమద్, అరాఫత్ మిన్హాస్, మొహమ్మద్ వసీమ్ జూనియర్, అబ్రార్ అహ్మద్, సుఫ్యాన్ ముకీమ్, అలీ రజా.
🏠 Home