🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 02 Oct, 2026 | Page: 1

మైనంపల్లిలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

దేవరకొండ,02 అక్టోబర్ (BVK 3 న్యూస్ ) :
మండలంలోని మైనంపల్లి గ్రామంలో నేడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ రాంసింగ్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
​ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ అందించిన సేవలను, ఆయన అహింసా మార్గాన్ని వక్తలు స్మరించుకున్నారు. గ్రామాన్ని స్వచ్ఛతలో, అభివృద్ధితో ముందుకు తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
​ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లాలూ నాయక్, పంచాయతీ కార్యదర్శి అంబేద్కర్, వార్డు సభ్యులు లక్ష్మీ ప్రశాంత్, కొర్ర కిషన్, పులిజల సంతోష వెంకట్, నాగరాజు, ఫీల్డ్ అసిస్టెంట్ అమరేందర్, అంగన్వాడీ టీచర్లు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
🏠 Home