🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 01 Oct, 2026 | Page: 1

నిరాడంబర శిఖరం నవభారత మార్గదర్శి

(అక్టోబర్ 2న లాల్ బహదూర్
శాస్త్రి 122 వ జయంతి
సందర్భంగా కవిత)
మహాత్మా గాంధీ సత్యశోధన
అయితే లాల్ బహదూర్ శాస్త్రి
ఆ సత్యానికి నిలువెత్తు రూపం.
అక్టోబర్ 2న జన్మించిన మరో
భారతరత్నం లాల్ బహుదూర్
శాస్త్రి స్మరణలో కవిత
మట్టిలో పుట్టిన మాణిక్యం
లాల్ బహుదూర్ శాస్త్రి
మచ్చలేని రాజకీయ
హిమశిఖరం నిరాడంబరతకు
నిలువెత్తు నిదర్శనం
లాల్ బహదూర్ శాస్త్రి జీవన
పయనం
భారత ప్రధానిగా పీఠం ఎక్కిన
అణుకవను వీడని అచంచల
వ్యక్తిత్వం కులాల హద్దులు చెరిపేసిన క్రాంతి ఆయన శాస్త్రిగా నిలిచిన విద్యా మూర్తి
పదవుల వ్యామోహం లేని
పరమ పవిత్రుడు
రైలు ప్రమాదానికి బాధ్యతగా
పదవినే వీడి నైతిక విలువలకు
నిలిచాడు సరికొత్త ఒరవడై
ఆహార కొరత దేశాన్ని చుట్టు ముడితే తను ఒక్క పూట ఉపవాసం ఉండి దిశానిర్దేశనం చేసిన ఆదర్శ మూర్తి
దేశం ఆకలితో అలమటించిన వేళ
హరిత శ్వేత విప్లవాలకు బాట
వేశాడు శత్రువు సరిహద్దులు
దాటిన జై జవాన్ జై కిసాన్
అంటూ గర్జించాడు
హరితవిప్లవానికి అంకురార్పణ
చేసి శ్వేత విప్లవంలో పాల
వెల్లువ కురిపించాడు.
జై జవాన్ జై కిసాన్ అని గర్జించి
రైతును సైనికుడినిఒకేలాపూజించి
1965 పాకిస్తాన్ యుద్ధంలో
సింహమై కదిలాడు
శత్రువుల గుండెల్లో వణుకు
పుట్టించాడు
తాస్కెంట్ ఒప్పందం వేల
నువ్వు విడిచిన శ్వాస
భారతావని గుండెల్లో
నిలిపింది ఒక తీరని ఆశ
దేశం కోసం కరిగిన
నీ ప్రతిక్షణం అమరం
చరిత్ర పుటల్లో నీత్యాగం
ఎప్పటికీ అజరామరం
శాస్త్రి గారు శారీరకంగా
చిన్నవారైనా ఆయన
తీసుకున్న నిర్ణయాలు
దేశానికి చేసిన సేవలు
హిమాలయాలంత
ఎత్తైనవిఅని అటల్ బిహారి
వాజపేయి కొనియాడినట్లు
ఆమహనీయుని
ఆదర్శాలను దేశభక్తిని మన గుండెల్లో నింపుకొని నవభారత
నిర్మాణానికి పునరంకితమౌదాం
విజయ్ ఘాట్ లో వెలిగే
అమర జ్యోతి ఆయన
భారతమాత గర్వించే రత్న దీపం
నడకలో నమ్రత నడవడికలో
నిజాయితీ నేటి తరానికి శాస్త్రీయ
గారి జీవితమే ఒక స్ఫూర్తి
వారి ఆశయాల సాధనకు
పని చేయడమే నిజమైన నివాళి
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు తెలంగాణ
ఎకనామిక్ ఫోరం
ఆర్థికవేత్త రచయిత
కాలమిస్ట్ కరీంనగర్
9440245771
🏠 Home