🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 26 Sep, 2026 | Page: 1

అహం వీడితే ఆనందం

కోపం తాపం వద్దు
పగలు పట్టింపుల
పద్దులు వద్దు
కుట్రలు కుయుక్తుల
కుళ్ళు వద్దు
సంతృప్తి మన
సంపద కావాలి
సంతోషమే మన
భూషణం కావాలి
సద్గుణం సహనమే
మన సౌభాగ్యం
కావాలి
అహం వీడితే
ఆనందం
అలుకలు
మానితె అహల్లాధం
ఆందోళనలు వద్దు
ఆనందమే ముద్దు
పరోపకారమే మన
జీవనశైలైతే
పగలు సెగలు
అంతరించి
ప్రగతి
పురోగతి
పరుగెడుతుంది
ఆత్మీయతే
పరమానందం
అక్కున చేర్చుకునే
మనసే మన ఆస్తి
కావాలి
ఆస్తుల అంతస్తుల
అధికార హోదాల
దర్పణం వద్దు
డబ్బు జబ్బు
మబ్బులు వద్దు
ఆర్తత
ఆప్యాయత
ఆత్మీయతే ముద్దు
కలిమిడి తనమే
నీ జీవనవిధానం
కావాలి
పరోపకారం
ప్రగతిశీలతే ముద్దు
మన బాట కావాలి
అహం ఆవేశం
వీడితే ఆలోచన ‌
వివేకం విజ్ఞానం
నీ సొంతమోతుంది
మమత
మానవీయత
పరిమళిస్తే
మనశ్శాంతి
నీ వశమౌతుంది
ఒంటరి జీవితం
వద్దు సమిష్టి తత్త్వం
సామాజిక జీవనమే
నీ హద్దు కావాలి
త్యాగాలతో పోటీపడు
మంచిని పెంచి
మంచిని పంచే
మనసున్న
మనిషిగా
నిలిచిపో
త్యాగాల
పునాదుల
మీద చరిత్ర
నిర్మాతగా
నిలిచిపో
ప్రభావ శీల
వ్యక్తిత్వంతో
సమాజ మార్పుకై
ఆదర్శంగా ని‌లిచిపో
జనహితమే నీ
అభిమతమైతె
జనహృదయాలలో
గూడు కట్టుకొన్న
దేవుడైతావు
సహకారం
సంఘీభావం
సహనం నీతోడు
నీడ కావాలి
మనసున్న మనిషిగా
ఎదుగు
బాధ్యతలు
భాధలు
భరోసాతోనే
బంధాలు
బంధుత్వాలు
నిలుస్తాయి
కష్టాలు కలిమి
లేములు కావడి
కుండలు
కష్టాలకు కుంగక
సమస్యలకు బెదరక
పొగడ్తలకు పొంగక
ఆత్మవిశ్వాసమే
ఆయుధంగా
జీవిత లక్ష్య
సాధనలో
విజయుడిగా
నిలవాలి
ఆత్మగౌరవంతో
ఆదర్శంగా బతకాలి
మనోధైర్యంతో మానవ
వికాసంలో మార్గదర్శిగా
నిలవాలి
చీకటిని తొలగించే
చిరు ధీపమై వెలగాలి

నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక
కరీంనగర్ 9440245771
🏠 Home