🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 24 Sep, 2026 | Page: 1

ఎమ్మెల్యేల పెన్షన్లకు లేని నిబంధనలు పేద ప్రజల చేయూత పెన్షన్ లకు ఎందుకు?

తక్షణమే పేద ప్రజలకు ఇచ్చే సామాజిక భద్రత పెన్షన్ల విషయంలో నిబంధలను పూర్తిగా సడలించాలి
బీపీల్ కార్డు ఉండి దరఖాస్తు చేసుకున్న అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్ మంజూరు చేయాలి
పెన్షన్ అనేది సామాజిక భద్రత దాన్ని పొందే హక్కు అర్హులైన ప్రతి ఒక్కరికి ఉంది
ఎమ్మెల్యేలకు పెన్షన్ లు పూర్తిగా రద్దు చేయాలి
ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన కల్లుగీత కార్మిక సంఘం
ములుగు జిల్లా కమిటీ.
ములుగు, జిల్లా ప్రతినిధి,
సెప్టెంబర్ 24 (బి వి కె న్యూస్):
వృత్తిదారులకు వితంతువులకు ఒంటరి మహిళలకు చేనేత గీత కార్మికులకు ఇచ్చే పెన్షన్ల విషయంలో నిబంధనలు పూర్తిగా సడలించాలని కల్లు గీత కార్మిక సంఘం ములుగు జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.
కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెబోయిన రవి గౌడ్, బుర్ర శ్రీనివాస్ గౌడ్
ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగు ఎకరాల భూమి ఉన్న ఫోర్ వీలర్ వాహనం ఉన్న పెన్షన్ రద్దు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు గెలిస్తే అన్నిసార్లు పెన్షన్ ఇస్తున్న పాలకులు వారి పింఛన్ ల విషయం పైన నిబంధనలు పక్కనపెట్టి పేద ప్రజలకు సామాజిక భద్రత అయిన పింఛన్ల విషయంలో ఇన్ని నిబంధన పెట్టడం సరైనది కాదని వారు అన్నారు.
ఈ విషయంలో తక్షణమే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఇచ్చే పెన్షన్ల విషయంలో నిబంధన లు సడలింపు ఫై తీర్మానం చేసి తెల్ల రేషన్ కార్డు ఉన్న అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్స్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
🏠 Home