🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 23 Sep, 2026 | Page: 1

నవభారత నిర్మాణంలో యువశక్తి

ఒక ఆలోచనను తీసుకోండి. ఆ ఆలోచననే మీ జీవితంగా చేసుకోండి. దాని గురించే ఆలోచించండి. దాని గురించే కలలు కనండి. ఆ ఆలోచనతోనే బతకండి .మీ మెదడు కండరాలు నరాలు మీ శరీరంలో ప్రతి భాగం ఆ ఆలోచనతో నిండిపోనివ్వండి. ఇదే విజయానికి మార్గం.
_స్వామి వివేకానంద
నేను కాదు నువ్వు
అనే అమూల్యమైన నినాదంతో నిరంతరం సమాజ సేవలో తరిస్తూ దేశ నిర్మాణంలో భాగస్వాములు అవుతున్న విద్యార్థిలోకానికి ప్రతీక జాతీయ సేవా పథకం. మహాత్మా గాంధీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 24న ఎన్ ఎస్ ఎస్ ప్రారంభమైంది. దేశములోని 771 యూనివర్సిటీల్లో 42 000 పైగా ఎన్ ఎస్ ఎస్ యూనిట్లు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి.
యువత నాయకత్వం
ఎన్ ఎస్ ఎస్ యువతలో సామాజిక బాధ్యతను నాయకత్వ లక్షణాలు పెంపొందించే అద్భుత వేదికగా నిలవడం గమనార్హం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 24న తేదీ దేశవ్యాప్తంగాఎన్ ఎస్ ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుతారు.
2026 సంవత్సరం ప్రత్యేక ప్రాధాన్యత థీమ్
ఈ ఏడాది 2026 లోఎన్ ఎస్ ఎస్ తన సేవా కార్యక్రమాలను సరికొత్త లక్ష్యంతో ముందుకు తీసుకువెళ్తుంది. ప్రస్తుత సమాజాన్ని పీడిస్తున్న అతి పెద్ద సమస్యపై యువతను చైతన్యపరచడానికి వికసిత భారత్ కోసం వ్యసన ముక్త యువత( Nasha Muktha yuva viksit Barath) అనే జాతీయ సంకల్పంతో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించ వలసిన యువశక్తి మత్తుపదార్థాల డిజిటల్ వ్యసనాల బారిన పడకుండా కాపాడుకోవడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం .
నా ఆరోగ్యం నా గర్వం ఫిట్
యువత వ్యసన రహిత యువత వారోత్సవాలు నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా నా ఆరోగ్యం నా గర్వం ఫిట్ యువత మిషనరీ అయితే యువత కొరకు 12 వారాల ప్రత్యేక కార్యచరణను దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఎస్ఎస్ యూనిట్లలో వాలంటీర్లు ఊరేగింపుల ద్వారా సదస్సుల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తారు. *
పర్యావరణ పరిరక్షణలో యువత
గ్లోబల్ వార్మింగ్ పర్యావరణ కాలుష్యం ప్రపంచాన్ని అతలాకుతం చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో పర్యావరణాన్ని కాపాడడంలో యువత పాత్ర చాలా కీలకం. పర్యావరణాన్ని కాపాడడంలో యువత పాత్ర చాలా కీలకం. కేవలం మొక్కలు నాటడం కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతలు కూడా తీసుకుంటున్నారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రచారం చేయడం
సదస్సులు సమావేశాలను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్య పరిచే శక్తి ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు. జలవనరుల సంరక్షణ సహజవనరుల సంరక్షణ వర్షపు నీటి గుంతలు ఏర్పాటుమరియు పునరుత్పాదక ఇంధన వనరులపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడం. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న మూఢవిశ్వాసాల పట్ల ప్రజా చైతన్యం అవగాహన కలిగించడంలో యువత అగ్రభాగాన నిలుస్తుంది. ప్రాణదాతలుగా యువత రక్తదానం
రక్తదానం ప్రాణదానంతో సమానం. ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర వైద్య పరిస్థితిలోనూ రక్తం దొరక్కపోతే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఎన్ ఎస్ ఎస్ నిరంతరం రక్తదాన శిబిరాలను నిర్వహిస్తుంది. రక్త దానం పై అపోహలు వీడండి ప్రాణదాతలుగా నిలవండి అంటూ తోటి విద్యార్థులను ప్రజలను చైతన్య పరుస్తూ తాము స్వయంగా రక్తదానం చేస్తూ లక్షలాదిమంది కి పునర్జన్మను ప్రసాదిస్తున్నారు.
ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆపద్బాంధవులు
వరదలు భూకంపాలు తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వం యంత్రాంగంతో పాటు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు (యువశక్తి) రంగంలోకి దిగుతుంది. ప్రాణాలకు తెగించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పునరావాస శిబిరాల్లో ఆహారము మందులు పంపిణీ చేయడం ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమం చేపట్టడం .అంటు వ్యాధులు తగలకుండా చూడటం వాలంటీర్లు చూపించే చొరవ ప్రశంసనీయం. విపత్కర పరిస్థితుల్లో వారు అందించే సేవలు బాధితులకు కొండంత ధైర్యాన్ని ఇస్తాయి.
ఎన్ ఎస్ ఎస్ చిహ్నం
ఒడిస్సా లోని సూర్య దేవాలయ రథ చక్రం ఆధారంగా ఎన్ఎస్ఎస్ లోగో ని రూపొందించారు. ఈ చక్రం నిరంతరం చలనానికి ప్రగతికి సంకేతం. చక్రంలోని 24 ఆకులు రోజులు 24 గంటలు సూచిస్తూ దేశ సేవ కోసం వాలంటీర్లు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని చాటి చెబుతుంది. ఇందులో నీలింరంగు విశ్వవ్యాప్తమైన సేవను ఎరుపు రంగు యువతలోని రక్తం ఉత్సాహంమరియు త్యాగ నిరతిని తెలియజేస్తాయి.
యువత కేవలం రేపటి పౌరులు మాత్రమే కాదు .నేటి సమాజానికి నైతిక దీపాలు .పట్టుదల ఆత్మవిశ్వాసం సేవాభావం ఉన్న యువతతోనే సగర్వ వికసిత భారత్ సాధ్యమవుతుంది.
అంతర్జాతీయ యువజన మార్పిడి కార్యక్రమాలు
జాతీయ సేవా పథకం అంతర్జాతీయ స్థాయిలో కూడా శాంతి సాంస్కృతిక మార్పిడి మరియు ప్రపంచ ప్రగతి కోసం విశేషమైన సేవలు అందిస్తుంది. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్టను చాటుతున్నారు. స్నేహపూర్వక దేశాలైన) చైనా రష్యా దక్షిణ కొరియా వియత్నాం ఆఫ్రికా దేశాల్లో) భారతదేశం జరిపే ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఆయాదేశాలు పర్యటిస్తున్నారు. భారతీయ సంప్రదాయాలను సామాజిక సేవ పద్ధతులను ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తారు.
ప్రపంచ శాంతి
అవగాహన వివిధ దేశాల యువతతో కలిసి అంతర్జాతీయ సమస్యలపై (వాతావరణ మార్పు పేదరికం ) మొదలగు సమస్యలపై చర్చలు జరిపి పరస్పర అవగాహన మరియు ప్రపంచ శాంతిని పెంపొందించడంలో భాగస్వాములు అవుతున్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలైన యునైటెడ్ నేషన్స్ వాలంటీర్స్ తో కలిసి భారత ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఎన్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద యువజన విభాగంగా గుర్తింపు పొందింది.
ఆరోగ్యం పరిశుభ్రత
అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వంటి సమయాల్లో ప్రపంచవ్యాప్త అవగాహన ఉద్యమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు భాగస్వాములు అవుతున్నారు.
దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్. వెనుకబడిన వారు వెనుకబడిన వారు వెనుకనే ఉంటే దేశమే గతి బాగుపడునోయ్ పొరుగు వారికి తోడ్పడవోయ్
వట్టి మాటలు కట్టిపెట్టి
గట్టి మేలు తలపెట్టవోయ్. గురజాడ అప్పారావు
యువత విదార్థి లోకం స్వామి వివేకానంద మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా స్వార్థాన్ని వీడి సమాజ శ్రేయస్సు కు సమాజ వికాసానికి పాటుపడతామని ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు ఎన్ ఎస్ ఎస్ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయాలి.
సేవయే మార్గంగా దేశ ప్రగతియే
లక్ష్యంగా మత్తును వీడుదాం. ప్రగతి బాట నడుద్దాం. వ్యసన ముక్త భారతాన్ని నిర్మిద్దామని
ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు ప్రతిజ్ఞ చేయాలి.
నేదునూరి కనకయ్య
మాజీ ఎన్ ఎస్ ఎస్ అధికారి
(ఇందిరాగాంధీ ఎన్ ఎస్ ఎస్
బెస్ట్ యూనిట్ అవార్డ్
గ్రహీత)
అధ్యక్షులు తెలంగాణ
ఎకనామిక్ ఫోరం
కరీంనగర్9440245771
🏠 Home